Virat Kohli: ఐపీఎల్ 2026 ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే పడింది. గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కింగ్.. జట్టుకు వరుసగా రెండో కప్ అందించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. మరి కోహ్లీ గత ఐపీఎల్ ఫైనల్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
తొలిసారి ట్రోఫీ అందుకున్న ఆర్సీబీ:
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 5వ సారి. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఫైనల్ ఫైట్ లో ఓడిపోయింది. 2016లో డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవగా, ఆ మ్యాచ్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్న విరాట్.. 54 రన్స్ తో పోరాడినా జట్టుకి టైటిల్ అందించలేకపోయాడు. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రజత్ పాటీదార్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. 2025 ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
►ALSO READ | ఆర్సీబీని కలవర పెడుతున్న విచిత్ర సెంటిమెంట్.. షాక్లో బెంగళూరు ఫ్యాన్స్
ఫైనల్స్ లో కోహ్లీ రికార్డులు:
ఐపీఎల్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ రికార్డులు అంత గొప్పగా ఏం లేవు.. లీగ్ దశలో అద్భుతంగా రాణించే కింగ్ కోహ్లీ.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌లో మాత్రం తడబడటం కామన్. ఇప్పటి వరకు కోహ్లీ 4 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడగా, మొత్తంగా 126.36 స్ట్రైక్ రేట్‌తో 139 రన్స్ మాత్రమే చేశాడు. ఇది విరాట్ ఐపీఎల్ కెరీర్ రికార్డు కంటే చాలా తక్కువ. ఫైనల్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 54.. హైదరాబాద్‌పై 2016లో ఈ స్కోర్ చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. గత రికార్డులను చెరిపేసి దూకుడుగా ఆడి? జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడా? అనేది చూడాలి.
