Health Alert : క్యాన్సర్పై గెలవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Health Alert : క్యాన్సర్పై గెలవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

శరీరంలో ఎక్కడో ఒక చోట చిన్న గడ్డ చేతికి తగులుతుంది... 'చిన్న గడ్డే తగ్గిపోతుందిలే!' అనుకుంటారు కొందరు. ఆ గడ్డ రోజు రోజుకి పెరుగుతుంటే కనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే.. క్యాన్సర్ ని మొదటి స్టేజీలోనే గుర్తిస్తే, సర్జరీ సరిపోతుంది. కోలుకునే అవకాశాలు ఎక్కువే. క్యాన్సర్ లక్షణాలు ఏ రూపంలో బయట పడినా వెంటనే డాక్టర్ ని కలవాలి. 

'కోజ్ ది కేర్ గ్యాప్... ఈ ఏడాది 'వరల్డ్ క్యాన్సర్ డే' థీమ్ డబ్బు ఉన్నవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన ట్రీట్మెంట్ అందించడమే ఈ థీమ్ ఉద్దేశం. మనదేశంలో ప్రతి లక్షమందిలో 100 నుంచి 110 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య తగ్గాలంటే... క్యాన్సర్ మీద అవేర్నెస్ కల్పించాలి. క్యాన్సర్ గురించి చెప్పడం, క్యాన్సర్ గురించిన అపోహల్ని తొలగించడం చాలాముఖ్యం. 

మొదట్లోనే గుర్తించాలంటే... 

క్యాన్సర్ ని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ టైమ్ తగ్గడమే కాదు.. తొందరగా కోలుకోవచ్చు కూడా. క్యాన్సర్ ని గుర్తించడం ఎలా అంటే... ఎవరికి వాళ్లు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడాన్ని మించింది లేదు. క్యాన్సర్లలో రకాలు, వాటి లక్షణాల గురించి ఆశా వర్కర్లు, నర్సులకి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతిజిల్లాలో క్యాన్సర్ బ్లాక్ ఏర్పాటు చేయాలి. దాంతో ఫస్ట్ స్టేజీలోనే క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంది. ఇలాచేస్తే కొన్నిరకాల క్యాన్సర్లని సర్జరీతో నయం చేయొచ్చు. అడ్వాన్స్ డ్ స్టేజీలో గుర్తిస్తే మాత్రం కీమోథెరపీ చేయాల్సిందే. 

కొందరికే కీమో..

క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ తప్పదు అను కుంటారు చాలామంది. కానీ, అందరికీ కీమో అవసరం ఉండదు. క్యాన్సర్ రకాన్ని బట్టి, అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉంటే కీమో చేస్తారు. అయితే, కొన్ని క్యాన్సర్లు మొదటి దశలో ఉన్నా కీమో చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం.. క్యాన్సర్ ఉన్నవాళ్లందరి జుట్టు ఊడిపోదు. కీమో థెరపీ మందుల ఎఫెక్ట్ వల్ల జుట్టు ఊడిపోతుంది. ఈ కండీషన్ని 'అలోపేషియా' అంటారు. అయితే, ఆఖరి కీమో అయిన నాలుగు వారాల నుంచి జుట్టు రావడం మొదలవుతుంది.

రెండింటికే వ్యాక్సిన్..

60 శాతం క్యాన్సర్లని నయం చేయొచ్చు. అయితే, చాలామంది అడ్వాన్స్డ్ స్టేజీలో డాక్టర్ దగ్గరకు వస్తారు. ట్రీట్మెంట్ ఆలస్య మవడంతో రికవరీ ఛాన్స్ తగ్గుతుంది. ఆడవాళ్లలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. 15 ఏండ్లు దాటిన ఆడపిల్ల లకి హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇస్తే, సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడొచ్చు. అలాగే లివర్ని దెబ్బతీసే హెపటై టిస్-బి క్యాన్సర్ కి కూడా వ్యాక్సిన్ ఉంది.

క్యాన్సర్లలో రకాలు..

బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్లు వంటివి ఆడవాళ్లలో ఎక్కువ. నెలసరి ఆగిపోయిన తర్వాత రొమ్ములో గడ్డలు ఏర్పడడం, రొమ్ముల నుంచి రక్తం కారడం బ్రెస్ట్ క్యాన్సర్ సంకేతాలు.

వ్యాక్సిన్ వేసుకోవచ్చు

క్యాన్సర్ ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటారు. డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లనే వీళ్లకి కూడా వ్యాక్సిన్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈమధ్యే క్యాన్సర్ నుంచి కోలుకున్నవాళ్లు, ట్రీట్మెంట్ తీసుకుం టున్నవాళ్లు కూడా కరోనా వ్యాక్సిన్ వేసు కోవచ్చు. అయితే, లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నవాళ్లు మాత్రం తీసుకోవద్దు.

మగవాళ్లలో రక్తహీనత సమస్య ఉంటే, అది క్యాన్సర్ దారితీసే ఉంది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ రావడానికి కారణం మ్యుటేషన్స్, కొన్నేమో హెరిడిటరీ, 5 నుంచి 10 శాతం క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి. 

కారణాలు ఇవీ

శరీరంలో ఒకచోట చిన్న గడ్డలా మొదలై ఒళ్లంతా వ్యాపిస్తుంది క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం కార్సినోజెన్స్, పొల్యూషన్, ఫుడ్ ద్వారా ఇవి శరీరంలోకి వెళ్తాయి. సిమెంట్ ఇండస్ట్రీ, కోల్మైన్స్, దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చే ప్లేస్ ల్లో పనిచేసేవాళ్లు క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఎక్కువ. బరువు పెరగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్ వంటివి వస్తాయి. ఆల్కహాల్ బాగా తాగేవాళ్లకి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సిగరెట్ తాగడం, పొగాకు, గుట్కా, తంబాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. మన దేశంలో నమోదయ్యే మూడొంతుల క్యాన్సర్లకి ఈ అలవాట్లే కారణం.

ఈ జాగ్రత్తలు పాటిస్తే...

ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినొద్దు. కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఎక్కువ ఉండే రెడ్మీట్ తినొద్దు. సిగరెట్, పొగాకు నమలడం మానేయాలి. క్యాన్సర్ లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ని కలవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి.

Also Read: సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ ప్రారంభించిన ధోనీ