ఎక్సర్​సైజ్​ ఏ టైంలో చేస్తే మంచిది ?

ఎక్సర్​సైజ్​ ఏ టైంలో చేస్తే మంచిది ?

మార్నింగ్ Vs ఈవెనింగ్

ఫిట్ నెస్​తో ఉండాలన్నా.. వెయిట్ తగ్గాలన్నా రెగ్యులర్ గా ఎక్సర్​సైజ్ చేయడం తప్పనిసరి. బ్రేక్​ఫాస్ట్ అయ్యాక చేయొచ్చా.. లేదా తినకముందే వాకింగ్ చేయాలా.. అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. అసలు.. వెయిట్ తగ్గేందుకు ఏ టైంలో ఎక్సర్​సైజ్​ చేయడం బెటర్ ? దానిదేముంది.. ‘రోజులో టైం దొరికినప్పుడు చేయొచ్చు’ అంటారా.. కానీ, మనం అనుకున్న రిజల్ట్ రావాలంటే మాత్రం ఎంచుకున్న ఎక్సర్​సైజ్​ని బట్టి టైమింగ్స్ ఫాలో అయితేనే బెటర్ అనేది ఫిట్​నెస్ ఎక్స్​పర్ట్స్​ సలహా. అందుకే ఏ టైంలో ఎక్సర్​సైజ్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో చూద్దాం.

ఎక్సర్​సైజ్ అనగానే కొంతమంది ఉత్సాహంగా నిద్రలేస్తారు. మరికొందరు బద్ధకంగా ఉండిపోతారు. ఎందుకంటే ఉదయాన్నే నిద్రలేవాలంటే అందరికీ బాడీ సహకరించకపోవచ్చు. అలాంటి వాళ్లు సాయంత్రాల్లో ఎక్సర్​సైజ్ చేయడానికి ఇష్టపడతారు. జాబ్ చేసేవాళ్లు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలసిపోతారు. కాబట్టి పొద్దున్నే వాకింగ్​కి వెళ్లడం మంచిదనుకుంటారు. వారి వారి ఫిట్​నెస్ అవసరాల్ని బట్టి పర్టికులర్ గా టైంని ఫిక్స్ చేసుకోవడం మంచిదంటున్నారు ట్రైనర్లు.

ఏం టైంలో బెటర్!

పొద్దున్నే ఎక్సర్​సైజ్ చేయడం మంచిదే కానీ, అందరి బాడీ ఒకేలా సపోర్ట్ చేయకపోవచ్చు. నిద్రలేచే టైంకు బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వామప్ చేసేందుకు అనీజీగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే చేయాల్సిందే అనుకుని ఎక్సర్​సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మజిల్స్ పట్టేయడం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు సాయంత్రాల్లో ఎక్సర్​సైజ్ చేయడం బెటర్. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలలోపు బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాయామానికి సపోర్టు చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఉండే పొగమంచు పడనివాళ్లు.. సాయంత్రం వాకింగ్​కి వెళ్లడం మంచిది. తప్పదు అనుకుంటే ఇన్​డోర్ లోనే పొద్దునపూట చేయడం బెటర్. చాలామంది ఎక్కువ టైం ఎక్సర్​సైజ్ చేస్తే ఎక్కువ బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ, అలాచేస్తే కేలరీలన్నీ పోయి ఎనర్జీ లాస్ అవుతాం. అలా కాకుండా క్రమం తప్పకుండా చేయడం మీద దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. కొంతమంది ఎక్స్​పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, మార్నింగ్ ఎక్సర్​సైజ్ చేసేవాళ్లతో పోలిస్తే.. సాయంత్రం చేసేవాళ్లు వేగంగా బరువు తగ్గుతారట. పొద్దున, సాయంత్రం ఎక్సర్​సైజ్ చేసే కొంతమందిపై సైంటిస్టులు చేసిన స్టడీల్లోనూ అదే తేలింది. మార్నింగ్ చేసేవాళ్లతో పోలిస్తే ఈవెనింగ్ ఎక్సర్​సైజ్ చేసేవాళ్లు ఫాస్ట్ గా బరువు తగ్గినట్లు గుర్తించారు. ఇదే స్టడీని ఎలుకలపై ప్రయోగించగా.. వాటిల్లోనూ ఈవెనింగ్ వర్కవుట్లతోనే మంచి రిజల్ట్స్ వచ్చిందట.

వెయిట్ తగ్గాలంటే సాయంత్రమే బెటర్

సాయంత్రం పూట ఆక్సిజన్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, బాడీ పనితీరు మెరుగవుతుంది. దీంతో వేగంగా బరువు తగ్గే చాన్స్ ఉంటుంది. ఎక్సర్​సైజ్ చేయడంతో వెయిట్ తగ్గడంలో కీలక పాత్ర పోషించే HIF-–1a అనే ప్రోటీన్ విడుదలవుతుందని సైంటిస్టులు కనుకొన్నారు. ఈవెనింగ్ టైంలో బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది,  కాబట్టి.. ఆ టైంలో ఎక్సర్​సైజ్ చేసేందుకు మజిల్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అప్పుడు ఎక్కువ శ్రమ కూడా పడనక్కర్లేదు. దీంతో హార్ట్ బీట్​ లెవెల్, బీపీ కంట్రోల్​లో ఉంటాయని అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్​సైజ్ ఓ స్టడీలో తేల్చింది. బరువు తగ్గడానికి ఉదయం ఎక్సర్​సైజ్ చేయడం కంటే సాయంత్రమే మంచిదనే స్టడీలు చెప్తున్నా.. దీనిని బలంగా నిర్ధారించేందుకు మరిన్ని స్టడీలు జరగాల్సి ఉందని అంటున్నారు.

సాయంత్రం పూట ఎక్సర్​సైజ్ చేసేవాళ్లు ఈ జాగ్రత్తలు పాటించాలి

సాయంత్రం ఎక్సర్​సైజ్ చేసి ఫ్రెషప్ అయి, డిన్నర్ చేశాక, కాసేపు వాకింగ్ చేస్తే నిద్రలేమి సమస్య రాకుండా చేయొచ్చు.

ఎక్సర్​సైజ్ చేసేముందు, చేసిన తర్వాత బాడీకి తగినస్థాయిలో కేలరీలు అందే ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవాలి.

రిజల్ట్ ఫాస్ట్ గా రావాలనుకుంటే ట్రైనర్ అబ్జర్వేషన్ లో హెవీ వర్కవుట్స్, కార్డియో వంటి ఎక్సర్​సైజెస్ ని యాడ్ చేయాలి.

ఇవన్నీ చేయడంతోపాటు  పోషకాలు అందే ఫుడ్​కి ప్రయారిటీ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం.

బ్రేక్​ఫాస్ట్ కి ముందా.. తిన్న తర్వాతనా?

బరువు తగ్గాలనుకునేవాళ్లు మాత్రం వాకింగ్ అయినా, ఎక్సర్​సైజ్ అయినా బ్రేక్​ఫాస్ట్ కి ముందే చేయాలని ఫిట్​నెస్ ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. బ్రేక్‌‌ఫాస్ట్ చేశాక ఎక్సర్​సైజ్ చేసేవారి కంటే ఏమీ తినకముందు చేసేవారిలో 20 శాతం కొవ్వు ఫాస్ట్​గా కరుగుతుందని స్టడీలు కూడా తేల్చాయి. జనరల్​గా ఎక్సర్​సైజ్ చేసేదే అనవసరపు కొవ్వు కరిగించుకోవడానికి. కాబట్టి, బ్రేక్​ఫాస్ట్ చేయడం వల్ల కొన్ని కేలరీలు తీసుకుని.. ఆ తర్వాత ఎక్సర్​సైజ్ చేస్తే.. అప్పటికే ఉన్న అదనపు కేలరీలతో పాటు జమయ్యే కొత్త కేలరీలు ఎప్పుడు కరుగుతాయి? అందుకే బరువు తగ్గాలంటే బ్రేక్​ఫాస్ట్ కు ముందు ఎక్సర్​సైజ్.. ఫుల్ వర్కవుట్ అవుతుందని చెప్తున్నారు ఫిట్​నెస్ ట్రైనర్లు.

Cork, Ireland