కరోనాను ఎదుర్కొనేందుకు మనమేం చేయాలంటే..

V6 Velugu Posted on Apr 16, 2021

ఒత్తిడి వద్దే వద్దు.. మనో బలమే మందు
ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘కరోనా’. ఏడాది క్రితం దేశంలోకి చొరబడింది ఈ మహమ్మారి. ఇప్పుడు రూపాన్ని మార్చుకుని మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌ వచ్చినా కేసులు పెరిగిపోతున్నాయి. అప్పుడంటే లాక్‌డౌన్‌ పెట్టిన్రు. ఇప్పుడు మనమే జాగ్రత్తపడాలి. ఆ మహమ్మారిని అంతం చేయగలమో లేదో తెలియదు. కానీ, కంట్రోల్‌ చెయొచ్చు. ఆందోళన పక్కనపెట్టి మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటే మహమ్మారి బారినపడకుండా ఉండొచ్చు. మనోబలానికి మించిన మందు మరోటి లేదు కదా!

వివిధ రకాలుగా రూపాంతరం చెందుతున్న కరోనా మహమ్మారిని దగ్గరకు రాకుండా ఎదుర్కొనే శక్తి మన చేతుల్లోనే ఉంది. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌‌గా ఉంటే మనం కచ్చితంగా మహమ్మారిని జయించవచ్చు. హెల్త్‌‌ ప్రొటోకాల్‌‌ను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌‌గా ఉండొచ్చు. మనుషులు ఎలా జీవించాలి? ఎలా ఉండాలనే విషయం ఈ మహమ్మారి మనకు నేర్పింది. హెల్దీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పకనే చెప్తోంది. కరోనా వస్తుందేమో అనే స్ట్రెస్‌‌ను దూరం పెట్టి, మన చుట్టూ ఉన్నవాళ్లతో మంచి విషయాలు మాట్లాడుతూ.. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేస్తే మనం సేఫ్‌‌గా ఉండొచ్చు. 
మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు
ఈ టైంలో మెంటల్‌‌ హెల్త్‌‌పై చాలా దృష్టిపెట్టాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే విషయాలపై ఫోకస్‌‌ అవసరం. అందుకే, దగ్గరి వాళ్లతో మాట్లాడుతూ మన మైండ్‌‌సెట్‌‌ను పాజిటివ్‌‌గా ఉంచుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తూనే  మరికొన్నింటిని అనుసరిస్తూ ఒత్తిడిని పోగొట్టుకోవచ్చు. 

శ్వాస..
ఇమ్యూనిటీ, బ్రెయిన్‌‌ ఫంక్షనింగ్‌‌ ఒకదానికొకటి లింకై ఉంటాయి. అందుకే, ప్రతిరోజు 10 నిమిషాల బ్రీతింగ్‌‌ ప్రాక్టీస్‌‌ వల్ల మెంటల్‌‌ స్ట్రెస్‌‌ ఉండదు. దాని వల్ల యాంగ్జైటీ, భయం పోతుంది. 

అందరితో మాట్లాడటం
 ప్యాండెమిక్‌‌ వల్ల ఇప్పుడంతా వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌, ఆన్‌‌లైన్‌‌ క్లాసులు నడుస్తున్నాయి. దీంతో ఫ్రెండ్స్‌‌, కొలీగ్స్‌‌ను కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఒంటరిగా అనిపిస్తుంది. అందుకే, రోజులో కనీసం ఒక్కసారైనా ఫ్రెండ్స్‌‌, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌‌తో మాట్లాడితే రిలీఫ్‌‌గా ఉంటుంది. 

పాజిటివ్‌‌ ఫీలింగ్‌‌
భయం, ఆందోళనలను కలిగించే ఇన్ఫర్మేషన్‌‌కు దూరంగా ఉండాలి. పాజిటివ్‌‌ ఫీలింగ్స్‌‌ ఇచ్చే వాటినే చూడాలి. అప్పుడే మనలోని అపోహలన్నీ పోయి మెంటల్‌‌గా ఫిట్‌‌గా ఉంటాం. 
సోషల్‌‌ స్ట్రెస్‌‌ తగ్గించుకునేందుకు..
కరోనా మహమ్మారి వల్ల సోషల్‌‌ అన్‌‌సెర్టనిటీ బాగా పెరిగిపోయింది.  కరోనా ఎక్కడ వస్తుందో అని మనవాళ్లనే దగ్గరికి రానివ్వకపోవడం లాంటివి చేస్తున్నారు చాలామంది. దానివల్ల జనాల్లో స్ట్రెస్‌‌, యాంగ్జైటీ పెరిగిపోతోంది. మీలో, మీ చుట్టూ ఉన్నవాళ్లలో సోషల్‌‌ స్ట్రెస్‌‌ను తగ్గించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

సోషల్‌‌ వెల్ఫేర్‌‌‌‌ గ్రూప్స్‌
సోషల్‌‌ వెల్ఫేర్‌‌‌‌ గ్రూప్స్‌‌తో కలిసి పనిచేయాలి. అవసరం ఉన్నవారికి హెల్ప్‌‌ చేయడం,  కావాల్సినవారికి ఫుడ్‌‌ పెట్టడం, వలంటీర్‌‌‌‌ సర్వీస్‌‌ చేయడం లాంటివి చేయాలి.  

సోషల్ మీడియాకు బ్రేక్

ఈకాలంలో సోషల్‌‌మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్‌‌ జనంలో భయాన్ని కలిగిస్తోంది. ఏదీ నిజమో?, ఏది ఫేకో? తెలియడం లేదు. అందుకే సోషల్‌‌ మీడియా నుంచి బ్రేక్‌‌ తీసుకుని ఇష్టమైన పాటలు, పాడ్‌‌కాస్ట్స్‌‌ వింటే సోషల్‌‌ స్ట్రెస్‌‌ నుంచి రిలీఫ్‌‌ ఉంటుంది. అదే టైంను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో పాజిటివ్‌‌ విషయాలు మాట్లాడేందుకు కేటాయించుకోవాలి. 

వేరే వాళ్లకు హెల్ప్‌‌
మీ గురించి మీరు కేర్‌‌‌‌ తీసుకుంటే ఇష్టమైన వాళ్లను కూడా మంచిగ చూసుకోవచ్చు. ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పటికీ నెట్‌‌వర్క్‌‌ కమ్యూనికేషన్‌‌ ద్వారా వాళ్లతో మాట్లాడుతూ ఉండొచ్చు. అందుకే, ఇష్టమైన వాళ్లతో తరచూ మాట్లాడుతూ వాళ్లకు ఉన్న స్ట్రెస్‌‌ను పోగొట్టాలి. ఒక సెల్ఫ్‌‌ హెల్ప్‌‌ గ్రూప్‌‌ను క్రియేట్‌‌ చేసి దాని ద్వారా ప్యాండమిక్‌కు సంబంధించి విషయాలను మాట్లాడొచ్చు, జాగ్రత్తలు చెప్పొచ్చు. 
ఆ రెండూ తగ్గాలంటే...
కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు హ్యాండ్స్‌‌వాష్‌‌ చేస్తూ, ఫిజికల్‌ డిస్టెన్స్‌‌ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు మరిన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్‌‌ వచ్చిందని, వేయించుకుంటే కరోనా పోతుందని అనుకోవద్దు ఎప్పుడూ మాస్క్‌‌ పెట్టుకుని కోవిడ్‌‌ ప్రొటొకాల్‌‌ పాటించాలి. మనల్ని మనం ఫిజికల్‌‌గా బలంగా ఉంచుకోవాలి. దానికోసం ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ లాంటివి చేయాలి.  
ఫిజికల్‌‌ డిస్టెన్సింగ్‌‌
కరోనా మన దగ్గరకు రాకుండా ఉండేందుకు ఫస్ట్‌‌ తీసుకోవాల్సిన స్టెప్‌‌ ఫిజికల్‌‌ డిస్టెన్​సింగ్​. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్‌‌‌‌ డిస్టెన్స్‌‌ ఉండాలి. ఒకరిని ఒకరు తాకకుండా ఉంటే ఇన్ఫెక్షన్‌‌ రిస్క్‌‌ తగ్గుతుంది. 

ఎప్పటికప్పుడు చెక్‌‌ చేసుకోవాలి
హెల్త్‌‌ మానిటరింగ్‌‌ ఎప్పటి కప్పుడు చెక్‌‌ చేసుకోవాలి. లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో గమనించుకోవాలి. వీలైతే ప్రతిరోజు టెంపరేచర్‌‌‌‌ చెక్‌‌ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మంచిది. బ్యాలెన్స్డ్‌‌ డైట్‌‌ తీసుకోవాలి.  వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. 

ఎక్సర్‌‌‌‌సైజ్‌‌
ఫిజికల్‌‌ స్ట్రెస్‌‌ను పోగొట్టుకోవాలంటే ప్రతిరోజు కచ్చితంగా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి. హెల్త్ సరిగా ఉండాలంటే ఫిజికల్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ ముఖ్యం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మైండ్‌‌ రిలీఫ్‌‌ అవుతుంది, స్ట్రెస్‌‌ తగ్గిపోతుంది. యోగా మైండ్‌‌ను యాక్టివ్‌‌ చేస్తుంది. 
 

Tagged healthy tips, corona, COVID19, experts suggetions,

Latest Videos

Subscribe Now

More News