Diwali Special : దీపావళి పండుగ పాయసాలు... సింపుల్ గా ఇలా తయారు చేయండి...రుచి అదిరిపోద్ది .!

Diwali Special :  దీపావళి పండుగ పాయసాలు... సింపుల్ గా ఇలా తయారు చేయండి...రుచి అదిరిపోద్ది .!

ఒక్కో పండుగకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. కానీ దీపావళి పండుగకు మాత్రం ఎన్నో ప్రత్యేకతలుంటాయి.దీపాలు, స్వీట్లు,పటాకులు... ఇలాచాలానే ఉంటాయి. వీటన్నింటితో పాటు పాయసాలతో తీయని వేడుకచేసుకుంటూ.. దీపావళి సంబరాలు చేసుకోండి.  కొన్ని ప్రత్యేకమైన దీపావళి పాయసాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .

పేనీ ఖీర్​  తయారీకి కావలసినవి

  • పేనీలు - ముప్పావు కప్పు
  • పాలు (బాగా మరిగి చిక్కగైనవి)- 2 కప్పులు 
  • చక్కెర - పావు కప్పు
  •  నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  •  బాదం పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  •  పిస్తా పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  • జీడిపప్పు తరుగు - అర టేబుల్ స్పూన్ 
  • ఇలాచీ పొడి -చిటికెడు

 తయారీ విధానం:  ముందుగా డ్రై ఫ్రూట్స్ ను నెయ్యిలో వేగించాలి. తర్వాత అదే నెయ్యిలో పేనీలనూ కొద్దిగా వేగించాలి. చిక్కటి పాలను మళ్లీ వేడి చేయడానికి ఇప్పుడు స్టవ్​ పై పెట్టాలి. అందులో చక్కెర వేసి కలపాలి. తర్వాత పేనీలు, నెయ్యిలో వేగిన బాదం, జీడిపప్పు, పిస్తా తరుగు వేయాలి. చివరగా ఇలాచీ పొడి కూడా వేసి కలిపి దింపేయాలి

రాగి ఖీర్​ పాయసం తయారీకి కావలసినవి

  • నెయ్యి– ఒక టేబుల్​ స్పూన్​
  • రాగిపిండి – ఒకటిన్నరటేబుల్​ స్పూన్
  • పాలు - ఒకటిన్నర కప్పు
  • చక్కెర పావు కప్పు
  • ఇలాచీ పొడి - పావు టీ స్పూన్
  • బాదం పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్ 
  • పిస్తా పప్పు తరుగు -అర టేబుల్ స్పూన్
  •  జీడిపప్పు తరుగు - అర టేబుల్ స్పూన్​
  • కుంకుమపువ్వు – చిటికెడు

తయారీవిధానం:ముందుగా డ్రై ఫ్రూట్స్ ను విడిగా నెయ్యిలో వేగించాలి. తర్వాత స్టవ్​  పై  కడాయి పెట్టాలి. అది వేడెక్కాక నెయ్యి వెయ్యాలి. మంట తగ్గించి రాగి పిండి వేసి కలపాలి. పిండి మాడకుండా వేగించాలి. తర్వాత అందులో వేడి పాలు కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా చూడాలి. ఇప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో నెయ్యిలో వేగిన బాదం, పిస్తా జీడిపప్పు తరుగు, ఇలాచీ పొడి, కుంకుమ పువ్పు వేయాలి. మిశ్రమం కాస్తంత చిక్కగా అయ్యాక దింపేయాలి.

మఖానా ఖీర్ తయారీకి కావలసినవి

  • పూల్ మఖానా-1 కప్పు (తామర గింజలు షాపుల్లో దొరుకుతాయి)
  • పాలు - 2 కప్పలు
  • చక్కెర - 4 టేబుల్ స్పూన్లు
  •  నెయ్యి -1 టీ స్పూన్లు
  • ఎండు ద్రాక్ష- అరటేబుల్ స్పూన్
  •  బాదం పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  •  పిస్తా పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  • జీడిపప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  • ఇలాచీ పొడి- చిటికెడు 
  • కుంకుమ పువ్వు – చిటికెడు

తయారీ విధానం :  ముందుగా డ్రైఫ్రూట్స్​ ను నెయ్యిలో వేగించాలి. అందులోనే మఖానాలను కూడా వేగించి పక్కన పెట్టాలి. ఇప్పుడు అందులో ముప్పావు కప్పు మఖానాలను మిక్సీలో వేసి  పొడి చేయాలి. తర్వాత స్టవ్​ పై గిన్నె పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు చక్కెర వేయాలి. ఆపైన ముఖానా పొడి మిగిలిన మఖానాలను వేసి కలపాలి మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు డ్రై  ఫ్రూట్స్​ వేయాలి రెండు నిమిషాల తరువాత పాయసాన్ని దింపేయాలి. 

 ఓట్స్​ ఖీర్​ తయారీకి కావలసినవి

  • నెయ్యి- 1టేబుల్ స్పూన్
  • ఓట్స్ అర కప్పు
  • పాలు 3కప్పులు
  • చక్కెర - అర కప్పు 
  • ఇలాచీ పొడి - పావు టీ స్పూన్
  • ఎండు ద్రాక్ష టేబుల్ స్పూన్
  • బాదం పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  • పిస్తా పప్పు తరుగు- అర టేబుల్ స్పూన్
  • జీడి పప్పు తరుగు - అరటేబుల్ స్పూన్
  • కుంకుమ పువ్వు - చిటికెడు

తయారీ విధానం:  ముందుగా డ్రై ఫ్రూట్స్​ ను విడిగా నెయ్యిలో వేగించాలి తర్వాత స్టవ్​ పై కడాయి పెట్టి నెయ్యి వెయ్యాలి మంట తగ్గించి ఓట్స్​ వేయాలి. అవి కాస్త వేగాక పాలు, చక్కెర వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యిలో వేగిన బాదం, పిస్తా జీడిపప్పు తరుగు, ఎండు ద్రాక్ష, ఇలాచీ పోడి, కుంకుమ పువ్వు వేయాలి. అయిదు నిమిషాల తర్వాత ఖీర్ ను దింపేయాలి..

సగ్గుబియ్యం​ ఖీర్​ తయారీకి కావలసినవి

  • సగ్గుబియ్యం (సాబుదానా) అర కప్పు
  • పాలు- 2 కప్పులు
  • చక్కెర. -3 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - పావు కప్పు
  • బాదం పప్పు తరుగు-అర టేబుల్ స్పూన్
  •  పిస్తా పప్పు తరుగు - అర టేబుల్ స్పూన్
  • జీడిపప్పు తరుగు - అర టేబుల్ స్పూన్ 
  • ఇలాచీ పొడి-చిటికెడు 
  • కుంకుమపువ్వు – చిటికెడు

తయారీవిధానం :  ముందుగా సగ్గుబియ్యం(సాబుదానా) పావు గంట పాటు నానబె ట్టాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ను నెయ్యిలో వేగించాలి. ఇప్పుడు మరో గిన్నెలో పాలు వేడి చేయాలి. అవి బాగా మరిగాక చక్కెర ఇలాచీ పొడి వేయాలి. పావు గంట తర్వాత అందులో సగ్గుబియ్యం, బాదం, జీడిప ప్పు, పిస్తా తరుగు, కుంకుమ పువ్వు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత పాయసాన్ని దింపేయాలి. . .