ఒక్క నెలలోనే 76 లక్షల వాట్సప్ అకౌంట్లు బ్యాన్..ఎందుకంటే.?

ఒక్క నెలలోనే 76 లక్షల వాట్సప్ అకౌంట్లు బ్యాన్..ఎందుకంటే.?

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్  వాట్సప్  యూజర్లకు షాకిచ్చింది. భారత్ లో ఒక్క నెలలోనే 76 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఒక్క ఫిబ్రవరిలోనే ఐటీ రూల్స్ కు అనుగుణంగా  భారత్ లో  76 లక్షలకు పైగా  ప్రమాదకరమైన అకౌంట్లను  నిషేధించినట్లు  తెలిపింది.

ఫిబ్రవరి1 నుంచి 29 మధ్య దాదాపు 76 లక్షల 28 వేల  వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ చేయబడ్డాయని తెలిపింది. వీటిలో  ఎలాంటి కంప్లైంట్స్ రాకముందే  14లక్షల 24 వేల అకౌంట్లు  ముందస్తుగా  బ్యాన్ చేశామని నివేదికలో తెలిపింది.

దేశంలో 500 మిలియన్లకు పైగా యూజర్లను  కలిగి ఉన్న మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సప్  ఫిబ్రవరిలో దేశంలో రికార్డు స్థాయిలో 16 వేల618 ఫిర్యాదు నివేదికలను అందుకుంది.

జనవరి 1 నుంచి 31 మధ్య  కంపెనీ 67లక్షల 28 వేల  అకౌంట్లను నిషేధించింది. ఈ  అకౌంట్లో దాదాపు 13లక్షల58 వేల అకౌంట్లు యూజర్ల  నుండి ఎటువంటి నివేదికలు రాకముందే ముందస్తుగా నిషేధించబడ్డాయి.

అకౌంట్స్ యాక్షన్డ్  అనేది కంపెనీ ఒక అకౌంట్ నిషేధించడానికి లేదా  పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది. యూజర్స్  నుంచి వచ్చే ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధిస్తోంది.