వాట్సాప్​లో కొత్త ఫీచర్

వాట్సాప్​లో కొత్త ఫీచర్

న్యూఢిల్లీ: వినియోగదారులకు వాట్సాప్  మెసేజింగ్ యాప్ గుడ్​న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు వాట్సాప్​లో.. పంపిన మెసేజ్​ను డిలీట్ చేసుకునే చాన్స్ మాత్రమే ఉంది కానీ, ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. ఇపుడు ఆ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెప్తోంది. అంటే మనం అవతలివాళ్లకు పంపిన మెసేజ్​లో ఏవైనా తప్పులు దొర్లితే ఈ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చన్నమాట. ఈ ఎడిట్ ఆప్షన్​ను మెసేజింగ్ యాప్ బీటా వెర్షన్​లో చేర్చనున్నట్లు వాట్సాప్ ట్రాకింగ్ వెబ్ సైట్ వాబిటాఇన్ఫో బుధవారం వెల్లడించింది. ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ట్రయల్ వెర్షన్ స్క్రీన్ షాట్లను మీడియాకు విడుదల చేసింది. అయితే, ఈ ఆప్షన్ ఐదేండ్ల కిందటే వినియోగంలోకి తేవాలనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆగిపోయిందని, ఇప్పుడు మళ్లీ ఈ ఫీచర్​ను ఇంట్రడ్యూస్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. మొత్తానికి ఎడిట్ ఆప్షన్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఐవోఎస్, డెస్క్​టాప్ వెర్షన్​లలోనూ ఎడిట్ ఆప్షన్ తెచ్చే ఆలోచన ఉందంది.