టెక్నాలజీ : వాట్సాప్​లో సెర్చ్ ఈజీ

టెక్నాలజీ : వాట్సాప్​లో సెర్చ్ ఈజీ

వాట్సాప్​ గ్రూప్ చాట్స్​లో ఎవరు, ఎప్పుడు మెసేజ్​ చేశారో చూడటం ఇప్పుడిక ఈజీ. అందుకు వాట్సాప్ ‘సెర్చ్ బై డేట్’ అనే ఆప్షన్​ తెచ్చింది. ఐఓఎస్, మ్యాక్​ డెస్క్​టాప్, వాట్సాప్​ వెబ్​తో పాటు ఇతర ప్లాట్​ఫామ్స్​లో ఇప్పటికే అందుబాటులో ఉంది ఈ ఫీచర్. ఇది మీరు వెతకాలనుకున్న​ డేట్​తో మెసేజ్, ఫొటో, వీడియోలను వెతికేందుకు ఉపయోగపడుతుంది.  తేదీల వారీగా సెర్చ్ చేయడం వల్ల చాట్​ నావిగేట్ చేయడం ఈజీ అవుతుంది. 

సెర్చ్ బై డేట్

గ్రూప్​ చాట్ ఓపెన్ చేసి డేట్​ ప్రకారం సెర్చ్ చేయడానికి సెర్చ్​ సింబల్​పై క్లిక్ చేయాలి. అక్కడ ‘క్యాలెండర్’ ఆప్షన్​ని సెలక్ట్ చేయాలి. తరువాత క్యాలెండర్​ గుర్తును ట్యాప్​ చేసి ఏ తారీఖు మెసేజ్​లు చూడాలనుకుంటే ఆ డేట్​ ఎంచుకోవాలి.

ఫొటో సెర్చ్​ కోసం

గ్రూప్​లో కుడివైపు పైనున్న మూడు చుక్కల్ని ట్యాప్ చేస్తే ‘గ్రూప్ మీడియా’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్​ చేస్తే మీడియా, లింక్స్​, డాక్స్ అనే ఆప్షన్స్​ కనిపిస్తాయి. వాటిలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్​, లింక్స్​ కనిపిస్తాయి. 

మాటిమాటికి లాక్ తీయక్కర్లే!

గూగుల్ మ్యాప్స్​ వాడేటప్పుడు స్క్రీన్​ లాక్ అవడం అనేది అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ తెచ్చింది. 

గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే టైంతోపాటు షార్ట్​ కట్ రూట్స్​ కూడా కనిపిస్తాయి. మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్​ లాక్ అయితే అన్​లాక్ చేసి వివరాలు చూడాలి. కానీ, కొత్త ఫీచర్​తో మొబైల్ స్క్రీన్ లాక్ అయినా, లాక్​ స్క్రీన్​పై వివరాలు కనపడతాయి. దీంతో మ్యాప్స్​ వాడేటప్పుడు మాటిమాటికి ఫోన్​ లాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.  ఈ ఫీచర్​ని ఎనేబుల్ చేసుకోవాలంటే...

మ్యాప్స్​లో గ్లాన్సబుల్ ఫీచర్​ డిఫాల్ట్​గా ఆఫ్​లో ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి.

  •     గూగుల్ మ్యాప్స్ పైన కుడివైపు కనిపించే ప్రొఫైల్ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి.  
  •     సెట్టింగ్స్​లో నావిగేషన్​ సెట్టింగ్స్ ఆప్షన్​ సెలక్ట్ చేయాలి. 
  •     అందులో కిందికి స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్​ వైల్ నావిగేటింగ్’ అని ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి.