వాట్సప్ లో కొత్త ఫీచర్..బ్యాకప్ కు నో ఫికర్!

వాట్సప్ లో కొత్త ఫీచర్..బ్యాకప్ కు నో ఫికర్!

వాట్సాప్​లో మరొక ఇంట్రెస్టింగ్​ ఫీచర్​ త్వరలోనే రాబోతుంది. అదేంటంటే.. చాట్​ బ్యాకప్​లను పాస్​కీ ఎన్​క్రిప్షన్​తో ప్రొటెక్ట్​ చేయొచ్చు. అంటే ఈ ఫీచర్​ వస్తే చాట్​ బ్యాకప్​ సేఫ్​ అన్నమాట. పాస్ వర్డ్ లేదా 6 – డిజిట్స్ కీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్​ బ్యాకప్​ను ఫింగర్​ ప్రింట్​, ఫేస్ అన్​లాక్ లేదా స్క్రీన్​ లాక్​ వంటి బయోమెట్రిక్​ అథెంటికేషన్​ ద్వారా ఎన్​క్రిప్ట్​ చేయొచ్చు. మెటా ప్రకారం, ఫింగర్ ప్రింట్​, ఫేస్ రికగ్నిషన్​ లేదా లాక్ కోడ్ వంటి డివైజ్​ ఇంటర్నల్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్​ ఉపయోగిస్తుంది. చాట్ బ్యాకప్​లను ఎన్​క్రిప్ట్​ చేసిన యూజర్లు మాత్రమే డీ క్రిప్ట్​ చేయగలరు.

 ‘జీరో–నాలెడ్జ్’ సిస్టమ్​ అంటే వాట్సాప్​ కూడా బ్యాకప్​లను ట్రాక్​ చేయలేదు. దీన్ని ఎలా ఎనేబుల్​ చేయాలంటే.. ముందుగా వాట్సాప్​ ఓపెన్ చేసి settings>chats>chat backup> end to end encrypted ఆప్షన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. పాస్​ కీ ఎన్​క్రిప్షన్​ కనిపిస్తుంది. ఆ ఆప్షన్​ ఎనేబుల్ చేయాలి. తర్వాత ఫోన్​ బయోమెట్రిక్​ అథెంటికేట్​ కోసం అడుగుతుంది. వెరిఫై తర్వాత చాట్​ బ్యాకప్​ పాస్​ కీతో ఎన్​ క్రిప్ట్​ అవుతుంది. ఈ ప్రాసెస్​ తర్వాత పాస్​వర్డ్​ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 

బ్యాకప్​ను రిస్టోర్​ కోసం అథెంటికేట్​ (ఫింగర్ ప్రింట్, ఫేస్​ లేదా పిన్) మాత్రమే అవసరం. ఈ ఫీచర్​ మొదట ఆండ్రాయిడ్​ వాట్సాప్​ బీటాలో టెస్టింగ్ అయింది. ఇప్పుడు స్టేబుల్ వెర్షన్​లోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో డివైజ్​లకు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్​ వెర్షన్​కు యాప్​ను అప్​డేట్ చేస్తే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. 

పాత రీల్స్ మళ్లీ చూడొచ్చు

ఇన్​స్టాగ్రామ్​లో ‘రీల్స్ వాచ్ హిస్టరీ’ అనే సరికొత్త ఫీచర్​ను లాంచ్ చేసింది మెటా కంపెనీ. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇప్పటికే చూసిన షార్ట్​ వీడియోలను తిరిగి చూడొచ్చు. మీరు లైక్​ లేదా సేవ్ చేయడం మర్చిపోయిన రీల్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఫీచర్ కంటెంట్​ ఈజీగా గుర్తించుకోవడమే కాకుండా రీల్స్ యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది. యూజర్లు తమ వీడియోలను తేదీ వారీగా, ఓల్డ్ నుంచి న్యూగా కస్టమైజ్ చేయొచ్చు. 

అందుకోసం ముందుగా ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​కు వెళ్లాలి. టాప్​ రైట్ సైడ్ ఉన్న త్రీ–లైన్​ మెనూని ట్యాప్ చేయాలి. సెట్టింగ్స్ ఆప్షన్​ సెలక్ట్ చేసుకోవాలి. యువర్ యాక్టివిటీకి వెళ్లాలి. హిస్టరీ ఆప్షన్​ మీద ట్యాప్ చేయాలి. దీంతో రీసెంట్​గా చూసిన రీల్స్ ఫిల్టర్​ టూల్స్​తో పాటు చూడగలరు. ఈ ఫీచర్ ప్రజెంట్​ అందరికీ అందుబాటులో లేదు. ఇండియాతో మరికొన్ని దేశాల్లో కొత్త వెర్షన్​కు అప్​డేట్ అయినవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది.