వాట్సాప్‌లో అక్షరం తప్పుపోతే మళ్లీ ఎడిట్ చేయొచ్చు

వాట్సాప్‌లో అక్షరం తప్పుపోతే మళ్లీ ఎడిట్ చేయొచ్చు

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో యూజర్స్ ను ఆకట్టుకోనుంది. ఇప్పటికే ఎమోజీ రియాక్షన్, మెసేజ్ డిలీట్ సమయం పెంచిన వాట్సాప్ తాజాగా మెసేజ్ ను ఎడిట్ చేసుకునే ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మనం అవతలివారికి పంపిన మెసేజ్ లో ఏమైనా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించనుంది.Wabetainfo ఈ కొత్త ఫీచర్ కి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్.. మొత్తం మెసేజ్‌ను డిలీట్ చేస్తుంది. కానీ, ఈ ఎడిట్ ఆప్షన్‌లో మాత్రం తప్పుగా పంపిన మెసేజ్‌ను సరిచేసుకోవచ్చు. అక్షరాలను ఎడిట్ చేసుకుని, మళ్లీ పంపవచ్చు.

దేశంలో చాలా మంది వినియోగిస్తోన్న ఈ వాట్సాప్ ఇప్పటివరకూ ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటూ వస్తోంది. ఎమోజీ రియాక్షన్ నుంచి మెసేజ్ డిలీట్ చేసే సమయం పెంచడం, ఆటోమాటిక్ లాగౌట్, గ్రూప్ అడ్మిన్‌కి మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ లాంటి అనేక ఫీచర్లను తీసుకువచ్చిన మెటా.. మెసేజ్ లోని ఏదైనా అక్షరం తప్పుగా పడితే దాన్ని మార్చుకోవడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది.