కరోనాతో ఫ్యామిలీ హాస్పిటల్​లో ఉంటే.. ఇంట్లో దొంగలు పడ్డరు

కరోనాతో ఫ్యామిలీ హాస్పిటల్​లో ఉంటే.. ఇంట్లో దొంగలు పడ్డరు

30 తులాల బంగారం, 44 వేల చోరీ
వేములవాడ, వెలుగు:  కరోనా మహమ్మారితో ఇంటిల్లిపాది హాస్పిటల్​లో చేరారు.ఇంటి యాజమాని కరోనాతో చనిపోయాడు. భార్య, కొడుకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నగదు, బంగారం దొంగలు దోచుకెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వంకాయల అంజన్ దేవ్ కరోనాతో ఈ నెల 3న మృతిచెందాడు. భార్య, కొడుకుకు సైతం కరోనా రావడంతో హాస్పిటల్​లో చేరారు. ఇంట్లో అందరికీ కరోనా రావడంతో ఊర్లో జనం ఎవరూ అటువైపు చూడలేదు. శనివారం ట్రీట్ మెంట్​ అనంతరం కుటుంబీకులు ఇంటికి వచ్చారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో పాటు ఇంట్లో సామాను పూర్తిగా చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే ఇంట్లోని నగదు, బంగారం పరిశీలించగా కనపడలేదు. సుమారు 20 తులాల గోల్డ్, 44  వేల నగదు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​చార్జి సీఐ బన్సీలాల్ చెప్పారు.