భారత్ అనే పేరు మన దేశానికి ఎలా వచ్చిందంటే..

భారత్ అనే పేరు మన దేశానికి ఎలా వచ్చిందంటే..

‘భారత్’ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పదం.. దీని గురించే చర్చ.. ఎప్పుడూ లేనంతగా భారత్ గురించి చర్చ జరుగుతోంది. ఇండియా పేరు మార్చి భారత్ అని పెట్టాలని కేంద్రం యోచిస్తోందని.. సెప్టెంబర్ లో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దేశ అధికారిక పేరును ‘భారత్’ గా మార్చే తీర్మానాన్ని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దేశం పేరును భారత్ అని మార్చాలని బీజేపీ నేతలు అంటుండగా...పేరు మార్పుపై కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. జీ20 ఆ హ్వానంలో భారత్ పేరు మార్పుతో ఈ వివాదం తలెత్తింది. అయితే ఈ సమయంలో భారత్ కు ఆ పేరు ఎందుకు వచ్చింది. ఎప్పటినుంచి ఉంది... దాని అసలు కథ ఏంటో తెలుసుకుందాం. 

ఎటిమాలజీ ప్రకారం.. 

ఎటిమాలజీ ప్రకారం భరత అనే పదానికి మూలాలు, అర్థాలు చాలా ఉన్నాయి. భరత అనే పదం సంస్కృత పదం. 'భ్రూ' అనే మూలం నుండి వచ్చింది.  దీనర్థం.. రక్షించేవాడు, నిర్వహించడం, అందించడం అని. 

భరత  అనే పదానికి మరో మూలం ‘భ్రత’ అంటే భ్రాత అనగా సోదరుడు.. 'భరత' (భరద, భరహ) అనే పదానికి  రక్షింపబడేవాడు అని..  రక్షణ అందించే భూతి అని అర్థం కూడా వస్తుంది. 
కొన్ని నివేదికల ప్రకారం..భారతదేశపు అసలు భారత్ దీనికి వరిజినల్  పదం ‘‘భరద్’.. ‘భారహ్’.. ఇది ప్రాకృత భాష నుంచి వచ్చింది.  ఈ పదాలు ఖర్వేలా, వై శాసనాలు, జైన మత రికార్డుల్లో పేర్కొనబడ్డాయి.

పురాణాలు ఏం చేబుతున్నాయంటే..

భారత్ అనే పదం గురించి పురాణాలు, మహాభారతంలో ప్రస్తావన ఉంది. వీటిలో దేశానికి భారత్ వర్ష్ అని పిలుస్తారు. పురాణాల్లో ‘భారత్’ ను దక్షిణాన మహాసముద్రాలు, ఉత్తరాన హిమాలయాలున్న ప్రాంతంగా చెబుతున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయంగా చిన్న భాగాలుగా విభజించబడిందని పురాణాలు చెబుతున్నాయి. 

దశరథుడు కుమారుడు భరతుడికి రాజ్యాన్ని అప్పగించినప్పటి నుంచి భరత్ వర్ష్ అని పిలువబడిందని  విష్ణు పురాణం చెబుతోంది. జైన, హిందూ పురాణాల్లో భారత్ వర్ష్.. భారత ప్రాంతంగా కనిపిస్తుంది.  భారత దేశం అనే పేరు వెనక ఉన్న పురాణాలన్నీ ఉపఖండాన్ని పాలించిన చక్రవర్తి భరతుని కాలం నాటివి. 

కింగ్ భరత్ గురించి..

చంద్రరాజ వంశానికి చెందిన క్షత్రియ రాజు ‘భరత్’ గొప్పరాజు. శకుంతల, దుష్యంతుల కుమారుడు.. కౌరవులు, పాండవులకు పూర్వీకుడు. ఇతను తన రాజ్యాన్ని హిమాలయం నుంచి సముద్రం వరకు దేశం మొత్తాన్ని జయించి పాలన ఒకే గొడుగు కిందకు తెచ్చాడని చెబుతుంటారు. అతని పేరు మీదుగా భారత్ వర్ష్ అని పేరు వచ్చిందట.

రుగ్వేదం ఏం చెబుతుందంటే.. 

రుగ్వేదంలో.. భారత తెగకు చెందిన సుదాస రాజు పాలన గురించి ప్రస్తావించబడింది.  సుదాస రాజును ఓడించేందుకు 10 శక్తి వంతమైన తెగలు చేసిన యుద్దం గురించి చెబుతుంది. పంజాబ్ లోని రావీ నది ఒడ్డున యుద్దం జరిగిందట. భారత తెగలో ఎక్కువమంది సైన్యం, ఆధునాతన సైనిక నైపుణ్యంతో యుద్ధంలో గెలిచాడు. ఉపఖండం అంతటా అధికారం స్థాపించాడు. ప్రజల్లో క్రేజ్ సంపాదించాడు. అప్పటి నుంచి ప్రజలు తమను తాము భరత ప్రజలుగా గుర్తించడం ప్రారంభించారట. భారత అనే పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆ ప్రాంతాన్ని భరత భూమిగా పిలువడం ప్రారంభం అయింది. 

భారత్ అనే పదం జైన మతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. జైన సిద్దాంతం ప్రకారం.. మొదటి జైన తీర్థంకరుని పెద్ద కుమారుడు భరత చక్రవర్తి పేరు మీద ఈ దేశానికి  పేరు పెట్టారని తెలుస్తోంది. 

ఏదీ ఏమైనా భారత్ అనే పదం ప్రస్తావన ఇప్పటిది కాదు.. యుగాలుగా వస్తున్నదే.. అయితే భారత్ అనే పేరు మార్చాలని కేంద్ర యోచిస్తున్న నేపథ్యంలో భారత్ అనే పదానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్రం ప్రభుత్వం నిజంగా భారత్ పేరు పెట్టాలని ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేస్తుందా.. లేక ప్రతిపక్షాల ఆందోళనలతో వెనక్కి తగ్గుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.