టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఎవరిది..?

టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఎవరిది..?

టెస్టులకు ఆదరణ పెంచాలన్న ఉద్దేశంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ను తెచ్చింది. టెస్టుల్లో సాధించిన విజయాల ఆధారంగా భారత్, న్యూజీలాండ్ గతేడాది టెస్టు ఛాంపియన్ ఫైనల్ చేరాయి. ఈ ఫైనల్లో భారత్పై న్యూజీలాండ్ గెలిచి తొలి టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ను దక్కించుకుంది. ఇక వచ్చే ఏడాది టెస్టు ఛాంపియన్ షిప్ జరగనుంది. మరి ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరేందుకు ఏ ఏ జట్టుకు అవకాశాలున్నాయి..? ఏ జట్లు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం..

ఫస్ట్ ప్లేస్లో ప్రొటీస్..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా టాప్ ప్లేస్లో ఉంది. 71.43శాతం విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానంలో  కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆసీస్ 6విజయాలతో 70శాతం విన్నింగ్ పర్సంటేజీ సాధించి..సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. పాక్ తో ఫస్ట్ టెస్టులో ఓడిన శ్రీలంక ఆరోస్థానానికి పడిపోయింది. రెండో టెస్టులో శ్రీలంక 246పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో.... మళ్లీ మూడు స్థానాలు ఆ జట్టు ఎగబాకింది. తద్వారా మూడో ర్యాంక్‌‌కు చేరుకుంది. ప్రస్తుతం లంక 53.33 విన్నింగ్ పర్సంటేజీతో ఉంది.

నాల్గో స్థానంలో టీమిండియా..
టెస్టు ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక టెస్టు మ్యాచులను బట్టి..భారత్ ర్యాంకులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో  శ్రీలంక సాధించిన విజయాలను బట్టి భారత్ స్థానాలు మారుతూ ఉన్నాయి.  ప్రస్తుతం భారత్..ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరింటిలో గెలిచి... 4 మ్యాచుల్లో ఓడిపోయింది.  రెండు టెస్టులు డ్రా అయ్యాయి. భారత్ విన్నింగ్ పర్సంటేజీ 52.08గా ఉంది.

ఐదో స్థానంలో పాక్
శ్రీలంక చేతిలో రెండో టెస్టులో ఓడిన పాక్..మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పాక్  విన్నింగ్ పర్సంటేజీ 51.85గా ఉంది. ఐదో స్థానంలో ఉన్న  వెస్టిండీస్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ 50గా ఉంది.  7, 8, 9 స్థానాల్లో ఇంగ్లాండ్ (33.33), న్యూజిలాండ్ (25.93), బంగ్లాదేశ్ (13.13) విన్నింగ్ పర్సంటేజీలతో కొనసాగుతున్నాయి.