హైదరాబాద్, వెలుగు: ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు కేసీఆర్కు ఊడిగం చేస్తున్నట్టుగానే వ్యవహరిస్తున్నారని విప్ వేముల వీరేశం ఆరోపించారు. గురువారం ఆయన సీఎల్పీలో మీడియా తో మాట్లాడారు. బండి భగీరథ్ విషయంలో ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు కరెక్ట్ కాదన్నారు.
పోక్సో కేసును తామే వెలికితీసినట్టుగా ఆర్ఎస్ మాట్లాడుతున్నారని, తెలంగాణ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఆర్‌ఎస్ తీరు ఉందని ధ్వజమెత్తారు. ఆయన వాడుతున్న భాష సరిగ్గా లేదన్నారు. భగీరథ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారని, దానికి సంబంధించిన వీడియోలు సైతం ఉన్నాయన్నారు.
