కరోనాను మించిన మహమ్మారి రాబోతున్నది : డబ్ల్యూహెచ్‌‌వో

కరోనాను మించిన మహమ్మారి రాబోతున్నది  : డబ్ల్యూహెచ్‌‌వో

కరోనాను మించిన మహమ్మారి రాబోతున్నది

ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్‌‌వో

యునైటెడ్ నేషన్స్ : కరోనా వైరస్ రెండేండ్లపాటు ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మందిని బలితీసుకుంది. ఏడాదిగా జరంత ఊరటనిచ్చింది. ఇటీవల కేసులు పెరిగి మళ్లీ భయపెట్టినా.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసిస్.. ప్రపంచానికి ఓ వార్నింగ్ ఇచ్చారు. కరోనాను మించిన ప్రమాదకరమైన మరో పాండెమిక్ రాబోతున్నదని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

‘‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కొవిడ్ 19 ముగిసింది. అంతే తప్ప ప్రపంచ ఆరోగ్య ముప్పుగా కొవిడ్ 19 ముగియలేదు. మరో వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. కేసులు, మరణాలు పెరిగే ప్రమాదం ఉంది. మరింత ప్రమాదకరమైన వేరియంట్ వచ్చే ముప్పు ఇంకా తొలగిపోలేదు” అని చెప్పారు. 76వ వరల్డ్ హెల్త్ ఆసెంబ్లీలో ఈ మేరకు రిపోర్టును ప్రవేశపెట్టారు. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభావవంతమైన ప్రపంచ మెకానిజం అవసరమని టెడ్రోస్ పేర్కొన్నారు. మరో మహమ్మారి వచ్చినప్పుడు.. మనం నిర్ణయాత్మకంగా, సమష్టిగా, సమానంగా సమాధానం ఇవ్వడానికి కచ్చితంగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ‘‘మహమ్మారి మనల్ని దెబ్బతీసింది. అయితే ఇదే సమయంలో సస్టైనబుల్ డెవలప్‌‌మెంట్ గోల్స్.. సాధించే దిశగా ముందుకు సాగాలని తెలియజేసింది. మహమ్మారిని ఎదుర్కొన్న సంకల్పంతో ఆ గోల్స్‌‌ను ఎందుకు సాధించాలనేది చూపింది” అని టెడ్రోస్​ అథనామ్​ వివరించారు.