2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ దండయాత్రకు భారత జట్టు ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఎనర్జీ ఫార్ములాతో గ్రౌండ్‌లోకి దిగేందుకు బీసీసీఐ ఒక సాలిడ్ ప్లాన్ రెడీ చేసింది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాస్ గైడెన్స్‌లో ప్రస్తుత Gen-Z యంగ్ స్టార్స్ రంగంలోకి దిగబోతున్నారు. ఒకవైపు రోహిత్ సార్వభౌమత్వం, కోహ్లీ రన్ మెషిన్ ఫామ్ జట్టుకు కొండంత అండగా నిలవనుండగా, మరోవైపు నేటి తరం కుర్రాళ్లు తమ అగ్రెసివ్ గేమ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి సిద్ధం అవుతున్నారు.
జెన్-జీ స్టార్స్ మైండ్ బ్లాకింగ్ ఫామ్.. వీళ్లే భారత్ నెక్స్ట్ పిల్లర్స్:
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్లు రాబోయే వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రధాన బలంగా మారనున్నారు.
* ఓపెనింగ్ ధమాకా: రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ లేదా శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే పవర్‌ప్లేలో స్కోరు బోర్డు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
* మిడిల్ ఆర్డర్ విధ్వంసం: విరాట్ కోహ్లీ స్థిరత్వానికి తోడుగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తిప్పేయగలదు.
ఫిట్‌నెస్ + వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్.. బీసీసీఐ స్పెషల్ ఫోకస్:
ఈ కాంబినేషన్ మైదానంలో క్లిక్ అవ్వాలంటే సీనియర్ల ఫిట్‌నెస్‌తో పాటు యంగ్ ప్లేయర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని బీసీసీఐ గుర్తించింది. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్‌లలో స్టార్ ప్లేయర్లకు తగిన విశ్రాంతి ఇస్తూ, ప్రధాన టోర్నీ సమయానికి ప్రతి ఒక్కరూ 100 శాతం ఫిట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను బీసీసీఐ మెడికల్ టీమ్‌కు అప్పగించింది.
►ALSO READ | పాకిస్థాన్ క్రికెట్‌లో మరో బిగ్ ట్విస్ట్.. సీనియర్లను తప్పించడంపై కోచ్ క్లారిటీ!
కప్పు కొట్టడమే ఏకైక లక్ష్యం.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా:
సీనియర్ల అనుభవం, జూనియర్ల అగ్రెషన్ కలగలిసిన ఈ భారత జట్టుని 2027 ప్రపంచకప్‌లో ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతోంది. మైదానంలో కోహ్లీ ప్యాషన్, రోహిత్ మైండ్ గేమ్స్‌తో పాటు గిల్-జైస్వాల్‌లాంటి Gen-Z ప్లేయర్ల నో ఫియర్ ఆటిట్యూడ్ టీమిండియానను మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెడుతుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఈ మాస్ ప్లేయర్ల కాంబోను మైదానంలో చూడటానికి క్రికెట్ అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ కి భారత స్క్వాడ్:
శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. జస్ప్రీత్ బుమ్రా, కులదీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ
