సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గం జ్యోతినగర్ దోబీఘాట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారని దోబీ ఘాట్రజక సంఘం, బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గురువారం మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీస్ఎదుట ఆందోళనకు దిగారు. 10 రోజుల కింద ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో బీసీ సంఘాల ఐక్యవేదిక మల్కాజిగిరి అధ్యక్షుడు కామల్ల ఐలన్న, ప్రధాన కార్యదర్శి రొయ్యల కృష్ణమూర్తి, రజక సంఘం అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ లక్ష్మణ్, కాసర్ల నాగరాజు, లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
