కొండా సుస్మితకు సీఎంను విమర్శించే అర్హత ఎక్కడిది?..పరకాల టికెట్ ఎవరైనా రాసిచ్చారా: జక్కని సునీత

కొండా సుస్మితకు సీఎంను విమర్శించే అర్హత ఎక్కడిది?..పరకాల టికెట్ ఎవరైనా రాసిచ్చారా: జక్కని సునీత
  • సీఎంకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కొండా సుస్మితకు ఎక్కడిదని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ జక్కని సునీత ప్రశ్నించారు. సీఎంపై సుస్మిత చేసిన కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించారు. బుధవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో సునీత మాట్లాడారు. పరకాల కాంగ్రెస్ టికెట్ సుస్మితకు ఎవరైనా రాసిచ్చారా? అని ప్రశ్నించారు. ఏ రోజైనా ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారా? అని నిలదీశారు.

సుస్మిత మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ నేతల మాటలను తలపిస్తోందన్నారు. ఇంతకీ సుస్మిత ఏ పార్టీ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ అంటే తనకు గౌరవం ఉందని సునీత చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. సుస్మిత వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు.