హైదరాబాద్‌‌ సిటీ: వచ్చే ఏడాది అక్టోబర్కల్లా ‘గోదావరి’ కంప్లీట్కావాలి: వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి

హైదరాబాద్‌‌ సిటీ: వచ్చే ఏడాది అక్టోబర్కల్లా ‘గోదావరి’ కంప్లీట్కావాలి: వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌‌–2, 3 పనులను వేగవంతం చేయాలని వాటర్‌‌బోర్డు ఎండీ అశోక్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా మల్లన్నసాగర్‌‌ నుంచి హైదరాబాద్‌‌కు 20 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. 

ఇందులో భాగంగా బుధవారం ఘన్‌‌పూర్‌‌ వద్ద నిర్మాణంలో ఉన్న 1,170 ఎంఎల్‌‌డీ సామర్థ్యమున్న వాటర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్‌‌ పనులను ఎండీ పరిశీలించారు. గోదావరి ప్యాకేజీ–2, 3లో ఇప్పటివరకు 10 కిలోమీటర్ల మేర పైప్‌‌లైన్‌‌ పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది అక్టోబర్‌‌లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అశోక్‌‌రెడ్డి ఆదేశించారు.