హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

న్యూఢిల్లీ: హ్యుందాయ్ తన కార్ల ధరలను సెప్టెం బర్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, అధిక నిర్వహణ వ్యయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంస్థ ఇప్పటివరకు భారాన్ని తానే భరించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులపై కొంత బారాన్ని మోపుతోంది. ఈ ఏడాది హ్యుందాయ్ ధరలను పెంచడం ఇది మూడోసారి ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన 0.6 శాతం, జూస్ ఒకలో తేదీను ఒక శాతం వరకు వరలు పెరిగాయి.

మోడల్ ను బట్టి రూ.12,800 వరకు భారం పడింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా ధరలను పెంచాయి. ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఇందుకు ప్రధాన కారణాలని కంపెనీలు చెబుతున్నాయి.