తైపే: ప్రపంచవ్యాప్తంగా ఏఐ, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లౌడ్ సర్వీసెస్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా తైవాన్ ఖజానా కళకళలాడుతోంది. ఇక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున విదేశాలకు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. దీంతో ఈ చిన్న దేశం జేబు నిండిపోయింది.
భారీగా మొత్తాన్ని తన ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ప్రతి పౌరుడికి 10 వేల తైవాన్ డాలర్ల (దాదాపు రూ.26 వేలు) చొప్పున ఇవ్వనుంది. ఇందుకోసం 7.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.12 లక్షల కోట్లు) కేటాయించనుంది. ఏఐ కారణంగా తైవాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది.
ఈ బలమైన వృద్ధి నేపథ్యంలో 2026 ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రభుత్వం 11 శాతానికి పెంచింది. ఆదాయం భారీగా పెరగడంతో పాటు బడ్జెట్ నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. అదనపు రుణాలు తీసుకోకుండానే ఈ నగదును ప్రజలకు పంచనుంది,
