నర్సంపేటలో పెద్ది విగ్రహ వివాదం.. ఇద్దరు సీఐలు బదిలీ

నర్సంపేటలో పెద్ది విగ్రహ వివాదం.. ఇద్దరు సీఐలు బదిలీ

నర్సంపేట, వెలుగు : వరంగల్​జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సీఐలను ట్రాన్స్ ఫర్ చేస్తూ సీపీ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట రూరల్​ సీఐ ఎం.సాయిరమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్ ను వీఆర్ కు బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న జె.శంకర్ రావును నర్సంపేట రూరల్, కె.ఫణిధర్ ను నెక్కొండ సీఐగా నియమించారు. కాగా, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది.