క్యూ ఆర్ కోడ్ ఉన్నవాళ్లనే జింఖానాలోకి అనుమతి

 క్యూ ఆర్ కోడ్ ఉన్నవాళ్లనే జింఖానాలోకి అనుమతి

ఆన్ లైన్లో మ్యాచ్ టికెట్స్ బుక్ చేసుకున్నవాళ్లకు జింఖానా గ్రౌండ్ లో  టికెట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది.  క్యూ ఆర్ కోడ్ ఉన్నవాళ్లనే జింఖానాలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఆఫ్ లైన్ టికెట్స్ ఇవ్వడంలేదని.. ఎవరూ జింఖాను రావొద్దని సూచిస్తున్నారు.   కేవలం ఆన్ లైన్లో వాళ్ళు మాత్రమే లైన్ ఉండాలని, వేరే వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 25న  నగరంలో జరిగే ఇండియా–ఆస్ట్రేలియా  మూడో టీ20 మ్యాచ్‌‌‌‌ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్‌‌‌‌ గత నాలుగు రోజులుగా ఉప్పల్‌‌‌‌, జింఖానా గ్రౌండ్‌‌‌‌చుట్టూ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 

ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు 

ఆదివారం జరగనున్న భారత్ – ఆసీస్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియం బయట మూడు రంగులతో పెయింట్స్ వేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఉన్న చెట్లకు కూడా మూడు రంగులు వేశారు. ఇక స్టేడియం దగ్గర టికెట్స్ ఇస్తారేమో అన్న ఆశతో అప్పుడుప్పుడు అభిమానులు వచ్చిపోతున్నారు. ఇప్పటికే టికెట్స్ ఇష్యూ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న HCA.. మ్యాచ్ నిర్వహణ లో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.