దోస్త్ అని చూడకుండా చితక్కొట్టాడు.. రింకూకు బౌలింగ్ చేసింది ఎవరో తెలిస్తే షాక్

 దోస్త్ అని చూడకుండా చితక్కొట్టాడు..  రింకూకు బౌలింగ్ చేసింది ఎవరో తెలిస్తే షాక్

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 09న ఆదివారం రోజున   గుజరాత్ టైటాన్స్,  కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మంచి కిక్  ఇచ్చింది.  చివరి  ఓవర్లో మొత్తం మ్యాచ్ రూపు రేఖలు మారిపోయాయి. అల్మోస్ట్  గుజరాత్  విజయం ఖాయం అనుకున్న టైమ్ లో కేకేఆర్  ఆటగాడు రింకు సింగ్‌ చేసిన విధ్వంసం మాముల్ది కాదు.  ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి  29 పరుగులు అవసరం అనుకున్న  క్రమంలో బ్యాటింగ్ లో ఉన్న రింకు సింగ్‌  చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వేసిన ఈ ఓవర్‌‌లో రింకు సింగ్ వరుసగా సిక్సర్లు బాదాడు. అయితే ఇక్కడ  ఓ అసక్తికరమైన విషయం ఎంటంటే.. రింకు సింగ్‌, యశ్ దయాల్ ఇద్దరు మంచి స్నేహితులు కావడం.  దేశావాళీ  క్రికెట్ లో ఇద్దరు ఉత్తరప్రదేశ్ తరుపున ఆడాడు.   యశ్ దయాళ్ డిసెంబర్ 13, 1997న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించాడు.  ఐపీఎల్ 2022  మెగా వేలంలో యష్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ 3.2 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.  

అతను తన తొలి సీజన్‌లో గుజరాత్ తరుపున  9 మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు భారత జట్టులో అతను ఎంపికయ్యాడు. కానీ అతనికి  సత్తా నిరూపించుకునే అవకాశం రాలేదు. యష్ దయాల్ తన కెరీర్‌లో 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్ A మ్యాచ్‌లు, 33 T20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు. రింకు సింగ్‌ కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని జన్మించాడు.