
పొగాకు కేన్సర్ కు కారణం.. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్.. గుట్కా ప్యాకెట్లపై కేన్సర్ కారకం అని రాసి ఉంటుంది. అయినా మనం వాటిని ఏం పట్టించుకోం.. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ( జులై) ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలకు షాకింగ్ న్యూస్ చెప్పబోతుంది. కొన్ని కంపెనీల స్నాపిల్ (కూల్) డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన సర్వేలో వెల్లడైంది. అలాంటి కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింక్స్ ను గుర్తించి వాటిపై ఇది క్యాన్సర్ కు కారణమని ముద్రించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు ఇచ్చేందుకు రడీ అవుతోందని సమాచారం అందుతోంది. WHO సర్వేలో యేయే కంపెనీలుఉన్నాయో నని కూల్ డ్రింక్స్ కంపెనీ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)చే జూలైలో క్యాన్సర్ కారకాలుగా జాబితా కూల్ డ్రింక్స్ ను చేర్చేందుకు నిర్ణయం తీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) క్యాన్సర్ పరిశోధన విభాగం వర్గాలు తెలిపాయి. IARC నివేదిక కూల్ డ్రింక్స్ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తుంది. WHO కమిటీ సమావేశం ఇప్పటికే ప్రారంభమయింది. అయితే ఈ సమావేశ నిర్ణయాలను జూలై 14న IARC ప్రకటించనుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు లేదా మూడు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది..
శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. 60,000 మందికి పైగా యువకులపై ఒక పరిశోధన చేశారు. వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలను 87 శాతం పెంచారు. అదే సమయంలో.. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఎక్కువ శీతల పానీయాలు తీసుకునే అలవాటు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ కు కారణమవుతుందని మరొక అధ్యయనం వెల్లడించింది.
ముఖ్యంగా మహిళలు ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 95,464 మంది మహిళలను 24 సంవత్సరాల పాటు పర్యవేక్షించగా వీరిలో కూల్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగే 109 మంది మహిళలు 50 సంవత్సరాల లోపు పెద్ద ప్యాకెట్ క్యాన్సర్ బారినపడి మరణించారు. ఈ పెద్ద పేగు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణహాని ఉండదు. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
అయితే ఇలా ప్రతిరోజు ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుండా ఎప్పుడో ఒకసారి కూల్‌డ్రింక్ తాగే మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. చాలా కాలం నుండి కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానిరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కూల్ డ్రింక్స్ తయారు చేయడానికి కృత్రిమ చక్కెర, ప్రిజర్వేటివ్‌లు మొదలైన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఉబకాయం సమస్య తలెత్తుతుంది. దీంతో చిన్నతనంలోనే ప్రీమెచ్యూర్ హార్ట్, బీపీ, మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు వెంటడుతాయి. అంతే కాకుండా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల కాలేయా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కూల్ డ్రింక్స్ ఉన్న ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేయడానికి కాలేయం చాలా కష్టపడాలి. అందువల్ల తరచు కాలేయంలో వాపు వస్తుంది.