జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్: పింకథాన్ విన్నర్‌‌‌‌‌‌‌‌ నవ్య

జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్: పింకథాన్ విన్నర్‌‌‌‌‌‌‌‌ నవ్య

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్ 10 కి.మీ రన్‌‌‌‌లో వడ్డే నవ్య విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌‌‌‌లో జరిగిన ఈవెంట్‌‌‌‌లో నవ్య 49 నిమిషాల 59 సెకన్లలో పోడియం ఫినిష్ చేసింది. 5 కి.మీ రేస్‌‌‌‌లో కలపాల  మౌనిక (27 నిమిషాల 32 సెకన్లు) టాప్ ప్లేస్ సాధించగా..  3 కి.మీ రేసులో  అమల (19 నిమిషాల 10 సెకన్లు) చాంపియన్‌‌‌‌గా నిలిచింది. 5 వేల మంది రన్నర్లు పాల్గొన్న ఈవెంట్‌‌‌‌ను శాట్స్‌‌‌‌ వీసీ ఎండీ సోనిబాలా దేవి, పింకథాన్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌, బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ ప్రారంభించి విన్నర్లకు మెడల్స్ అందజేశారు.