
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) టీబీ(క్షయవ్యాధి) చికిత్సకు కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. ఇప్పుడు టీబీ రోగుల సంరక్షణకు పోషకాహారం కీలకం అని ప్రకటించింది. కొత్త విధానంలో టీబీ రోగులు ,వారి కుటుంబాలకు ఆహార సాయం అందించనుఉంది. త్వరగా కోలుకోవడం, టీబీ వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది WHO. బెంగళూరు డాక్టర్లు డాక్టర్ ఉమేష్ మోహన్ , డాక్టర్ శిల్పా అరాలికర్ పరిశోధనలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
పోషకాహారం ప్రధాన అంశంగా చికిత్స..
అక్టోబర్ ప్రారంభంలో TB సంరక్షణలో పోషకాహార పాత్రను నొక్కి చెప్పే కొత్త మార్గదర్శకాలను WHO విడుదల చేసింది.గతంలో ప్రధానంగా ఔషధ చికిత్సపై దృష్టి పెట్టేవారు. ఈసారి పోషకాహారం కీలకం అని ప్రకటించింది. ముఖ్యమైన సిఫార్సులలో పోషకాహారం లభించని ప్రాంతాల్లో TB రోగుల కుటుంబ సభ్యులకు ఆహార అందించడం.
TB చికిత్స ఫలితాలు రోగులు ,వారి కుటుంబాల పోషక స్థితితో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించిన WHO.. కొత్త విధానాల ద్వారా TB వ్యాధిని తగ్గించడం ,ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేట్లను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
ది పాత్ బ్రేకింగ్ స్టడీ..
భారత్ లో అధిక క్షయవ్యాధి ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు డాక్టర్లు డాక్టర్ ఉమేష్ మోహన్ , డాక్టర్ శిల్పా అరాలికర్ పరిశోధనలు చేశారు. క్షయ రోగులకు పోషకాహారం అందించి చికిత్స చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయని నిరూపించారు. క్షయవ్యాధి పురోగతికి కీలకమైన ప్రమాద కారణమైన పోషకాహార లోపంపై వారు దృష్టి సారించారు.
పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు క్షయవ్యాధికి ఎక్కువగా గురవుతారని.. పోషకాహార లోపం పరిష్కరించకుంటే కోలుకోవడం ఆలస్యం అవుతుందని నిర్ధారించారు. ఈ డాక్టర్ల పరిశోధనలు క్షయ సంరక్షణ ప్రోటోకాల్‌లలో చాలా కాలంగా ఉన్న అంతరాన్ని అంటే వైద్య చికిత్సను పోషకాహార అత్యవసర అవసరాన్ని హైలైట్ చేశాయి.