IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 04) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. తమ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోయిన గిల్ సేన, ఈ మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. మరోవైపు, చెన్నైపై ఘన విజయంతో టోర్నీని ఆరంభించిన రియాన్ పరాగ్ ఆధ్వర్యంలోని రాజస్థాన్ రాయల్స్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో అనే బజ్ క్రియేట్ అవుతుంది.
పిచ్ రిపోర్ట్:
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసే జట్లకే ఎక్కువ అనుకూలిస్తుంది. 2025 సీజన్ గణాంకాల ప్రకారం ఇక్కడ జరిగిన 9 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. ఇక్కడి అవుట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో పేసర్లకు ఈ పిచ్ ఎక్స్ ట్రా బౌన్స్ లభిస్తుంది.
హెడ్ టు హెట్ రికార్డులు:
ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో గుజరాత్ జట్టు ఆరుసార్లు విజయం సాధించగా, రాజస్థాన్ రెండు మ్యాచ్‌లలో గెలిచింది. ఈ గణాంకాలు గుజరాత్‌కు కొంత ఆధిక్యాన్ని చూపుతున్నాయి.
►ALSO READ | Virat Kohli: ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు.. నేనేమీ ఓవర్సీస్ ప్లేయర్ని కాదన్న కోహ్లీ
ఏ జట్టు గెలుస్తుందంటే:
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఇరు జట్లు బలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా ఆడిన జట్టే విజయం సాధించే ఛాన్స్ ఉంది.
తుది జట్ల అంచనా:
గుజరాత్ టైటాన్స్:
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కాగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్.
(ఇంపాక్ట్ ప్లేయర్: ప్రసిద్ధ్ కృష్ణ)
రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
(ఇంపాక్ట్ ప్లేయర్: డోనోవన్ ఫెరీరా)
