జోరుగా బెట్టింగులు.. హుజూరాబాద్​లో గెలుపెవరిది?

జోరుగా బెట్టింగులు.. హుజూరాబాద్​లో గెలుపెవరిది?
  • రూ. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు కాస్తున్న పందెంరాయుళ్లు
  • తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకతోపాటు విదేశాల్లోనూ బెట్టింగ్​లు
  • ఆన్​లైన్​లో కొందరు.. డైరెక్ట్​గా ఇంకొందరు..

హైదరాబాద్‌, వెలుగు: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పోలింగ్​ ముగియడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..? అనే దానిపై ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. కొందరైతే కోట్లకు కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. మొన్నటి వరకు ప్రీపోల్‌ బెట్టింగులు నడువగా.. ఇప్పుడు పోస్ట్‌ పోల్‌ బెట్టింగులు నడుస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. కొందరు పార్టీ కేంద్రంగానూ బెట్టింగ్‌ పెడుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశవిదేశాల్లోనూ ఇవి కొనసాగుతున్నాయి.

వాట్సాప్​ గ్రూప్​లు ఏర్పాటు చేసుకొని

హైదరాబాద్‌కు చెందిన కొందరు లీడర్లు ఇద్దరు అభ్యర్థులపై ప్రీ పోల్​ టైంలో రూ. కోట్లలో పందెం కాసినట్టు తెలిసింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఇద్దరు అభ్యర్థులపై సమంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. కేవలం గెలుపు వరకే బెట్టింగులు పరిమితం కాలేదు. అభ్యర్థులకు వచ్చే మెజార్టీపైనా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఈ తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో,  ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, నెల్లూరు, వైజాగ్‌, గుంటూరు, కడప, కర్నూలులో భారీగా బెట్టింగ్​లు కాస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్‌, షోలాపూర్‌, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ పందాలు కాస్తున్నారు.

హైదరాబాద్‌, వెలుగు: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పోలింగ్​ ముగియడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..? అనే దానిపై ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. కొందరైతే కోట్లకు కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. మొన్నటి వరకు ప్రీపోల్‌ బెట్టింగులు నడువగా.. ఇప్పుడు పోస్ట్‌ పోల్‌ బెట్టింగులు నడుస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. కొందరు పార్టీ కేంద్రంగానూ బెట్టింగ్‌ పెడుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశవిదేశాల్లోనూ ఇవి కొనసాగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, గల్ఫ్‌ దేశాల్లోని కొందరు తెలుగువాళ్లు బెట్టింగ్​లకు దిగుతున్నారు.

సర్వే ఫలితాలను బట్టే..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో వచ్చిన హుజూరాబాద్​ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారింది. ఈటలను ఓడించి తీరాలని టీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డింది. ఆయన వెంట ఉన్న నేతలను గులాబీ గూటికి చేర్చడంతో ఉప ఎన్నిక పోలింగ్‌ నాటికి ఈటల వెంట పిడికెడు మంది మాత్రమే మిగిలారు. అయినా ఆయనపై ప్రజల్లో అభిమానం ఉండటం, ఇంటెలిజెన్స్‌ సర్వేలతో పాటు ప్రైవేట్‌ సర్వే సంస్థలు కూడా గట్టిపోటీ అని పేర్కొనడంతో ఈ ఉప ఎన్నికపై ఇంట్రస్ట్‌ పెరిగింది. పలు సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్టులను వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేయడంతో.. వీటి ఆధారంగా పందెంరాయుళ్లు బెట్టింగ్​లకు తెరలేపారు. మొన్నటి వరకు ప్రీపోల్​ బెట్టింగ్​లు నడువగా.. శనివారం పోలింగ్​ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్​ పోల్స్​సర్వేల ఆధారంగా పెద్ద ఎత్తున బెట్టింగ్​లు మొదలయ్యాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమై, తుది ఫలితాలు వచ్చే వరకు పందాలు కొనసాగే అవకాశముంది.