గోధుమలతో ఈ వ్యాధులు దూరం

గోధుమలతో ఈ వ్యాధులు దూరం

రోజు వారీగా తీసుకునే ఆహారంతో మన ఆరోగ్యం ముడిపడి ఉంది. మంచి ఫుడ్ తో ఎలాంటి వ్యాధుల్లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.  ఇందులో గోధుమలు కీలకం. వీటితో మంచి పోషకాలు ఉండే లభించడంతో పాటు..రోగాల భారిన పడకుండా మనల్ని మనం కూడా కాపాడుకోచ్చు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి.

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గోధుమను కనీసం మూడు కప్పులు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఏ వ్యాధి మన దరికి చేరదు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపులో ఉంచేందుకు గోధుమలు చాలా ముఖ్యమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మహిళలు రోజువారీ 30 గ్రాముల గోధుమ ఆహారం సరిపోతుంది. గోధుమలతో దాదాపు 50 శాతం ఆస్తమా అవకాశాలను తగ్గిస్తుంది. గోధుమల్లో ప్లాంటు లిగ్నన్స్, ఒక రకం ఫైటో ట్యూయూరియంట్,ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పని చేస్తాయి.

గోధుమల్లో ప్రోటీన్లు,విటమిన్లు ఖనిజాలతో పాటు మనకు అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గోధుమలకు బరువును నియంత్రించే సహజ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఓబెసిటీ ఉన్న వారికి గోధుమ బెటర్ ఛాయిస్.

డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి గోధుమల ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.గోధుమ ఉత్పత్తులలో లభించే ఎక్కువ ఫైబర్ రక్తపోటు స్థాయిని తగ్గించటానికి సహాయపడుతుంది. దీని ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

గోధుమలు మృదువైన పేగులకు రక్షణను అందిస్తుంది. పైల్ ఆమ్ల స్రావాన్ని తగ్గిస్తుంది. అధిక పిత్త ఆమ్లాలు, పిత్తాశయ రాళ్లకు ప్రధాన కారణమవుతుంది. అంతేకాకుండా గోధుమను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో రక్తంలో ట్రెగ్లిజెరైడ్స్ లేదా కొవ్వును తగ్గిస్తుంది.