రెండేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన హోల్​సేల్​ ధరలు

రెండేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన హోల్​సేల్​ ధరలు

న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నా, తయారు చేసిన వస్తువులు, ఇంధనం, కరెంటు రేట్లు తగ్గడంతో ఈ జనవరిలో టోకు ధరల ఆధారిత ఇన్​ఫ్లేషన్​ రెండేళ్ల కనిష్ట స్థాయి 3.85 శాతానికి తగ్గింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్​ రేటు తగ్గడం ఇది వరుసగా తొమ్మిదో నెల. డబ్ల్యూపీఐ ఇన్​ఫ్లేషన్​ జనవరిలో 4.73 శాతంగా ఉండగా, కిందటి ఏడాది ఫిబ్రవరిలో 13.43 శాతంగా ఉంది.  ముడి పెట్రోలియం & సహజ వాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ప్రొడక్టులు, ఖనిజాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ & ఆప్టికల్ ప్రొడక్టులు, కెమికల్​ ప్రొడక్టులు, ఎలక్ట్రికల్ పరికరాలు, వెహికల్స్​, ట్రైలర్ల ధరలు తగ్గాయని కేంద్ర వాణిజ్య  పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 2021 జనవరి తరువాత డబ్ల్యూపీఐ ఇన్​ఫ్లేషన్​3.85 శాతానికి తగ్గడం ఇదే మొదటిసారి. 2021 జనవరిలో ఇది 2.51 శాతం రికార్డయింది. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా ధరల్లో బాగా తగ్గుదల కనిపిస్తోందని ఎకనమిస్టులు అంటున్నారు. 

కొద్దిగా తగ్గిన యూఎస్​ ఇన్​ఫ్లేషన్

మార్కెట్ అంచనాలకు తగినట్లుగానే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యూఎస్​ ఇన్​ఫ్లేషన్ రేటు 6 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెల అంటే జనవరి 2023 లో ఈ ఇన్​ఫ్లేషన్ రేటు 6.4 శాతంగా రికార్డయింది. యాన్యువల్​ ఇన్​ఫ్లేషన్​ రేటు తగ్గడం ఇది వరసగా ఎనిమిదో నెల. ఇన్​ఫ్లేషన్​ గణాంకాలను యూఎస్​ లేబర్​ డిపార్ట్​మెంట్​ రిలీజ్​ చేసింది. అంచనాలకు తగినట్లుగానే ఇన్​ఫ్లేషన్​ రేటు ఉండటంతో అమెరికా  మార్కెట్లు ట్రేడింగ్​ ప్రారంభంలోనే  బాగా పుంజుకున్నాయి.