
April WPI Inflation: నిన్న భారత ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఏప్రిల్ మాసానికి సంబంధించిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం డేటా బయటకు వచ్చేసింది. దాదాపు మూడేళ్ల నుంచి అదుపుతప్పిన ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్న భారత్ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి.
ఏప్రిల్ మాసంలో హోల్ సేల్ ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గటం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, ఇంధన ధరలు తగ్గుదల దోహదపడిందని ప్రభుత్వం వెల్లడించింది.
హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 2.05 శాతంగా ఉండగా.. గత ఏడాది ఏప్రిల్ మాసంలో 1.19 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మార్చిలో 1.57 శాతంగా ఉండగా ఏప్రిల్ మాసంలో భారీగా తగ్గి 0.86 శాతానికి చేసుకున్నాయి. ఇదే క్రమంలో కూరగాయలతో పాటు ఉల్లి ధరలు కూడా అదుపులోకి వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇదే క్రమంలో ఆయిల్ అండ్ పవర్ ద్రవ్యోల్బణం కూడా భారీగా తగ్గుదలను చూసినట్లు వెల్లడైంది.
Also Read : సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు డిపాజిట్ చేయెుచ్చు
అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్స్ ద్రవ్యోల్బణం మాత్రం 2.62 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మెుత్తానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన వేళ హోల్ సేల్ ద్రవ్యోల్బణం కూడా దానికి అనుగుణంగా తగ్గటం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో రానున్న సమావేశాల్లో భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తన కీలక రెపో రేట్లను తగ్గించటానికి వెసులుబాటు కులుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పరోక్షణంగా ఆర్థిక వ్యవస్థలో డబ్బు లభ్యతను పెంచి పురోగమనానికి దారితీనుంది.