4 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

4 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: టోకు  ద్రవ్యోల్బణం ఆగస్టులో నాలుగు నెలల కనిష్టం 1.31 శాతానికి చేరుకుంది.  ఉల్లి, ఆలు ధరలు పెరిగినా కూరగాయలు, ఇంధన ధరలు తగ్గాయి.  టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా రెండోసారి పడిపోయింది. మే నెలలో గరిష్టంగా 3.43 శాతానికి చేరింది. జులైలో ద్రవ్యోల్బణం 2.04 శాతంగా ఉంది. 

గత ఏడాది ఆగస్టులో డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 0.46 శాతంగా ఉంది. ఆహార వస్తువులు, ప్రాసెస్డ్​ ఆహార ఉత్పత్తులు,  వస్త్రాలు, యంత్రాలు, పరికరాల ధరల్లో తగ్గుదల వల్ల టోకు ద్రవ్యోల్బణం నెమ్మదించిందని కేంద్ర వాణిజ్య  పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 

మరిన్ని వార్తలు