తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..

తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..

ఆహార ధరలు పడిపోవడంతో గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, సెప్టెంబర్​లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం భారీగా తగ్గి 0.13 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఇది 0.52 శాతం ఉండగా, గత సంవత్సరం సెప్టెంబర్​లో 1.91 శాతంగా ఉంది.  

ఆహార పదార్థాలు 5.22 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదు చేశాయి. ఆగస్టులో ఇది 3.06 శాతం ఉంది. ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గడం ఇందుకు కారణం.  తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.55 శాతం నుంచి సెప్టెంబర్​లో 2.33 శాతానికి తగ్గింది.