భర్త వెనక భార్య నడుస్తుంది.. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది

భర్త వెనక భార్య నడుస్తుంది.. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది

భార్యభర్తల అనుభందంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గతంలో చేసిన వ్యాఖ్యలు లేటెస్ట్ గా వైరల్ అవుతున్నాయి. 2018లో ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ఆమె..ఇండియాలో  భర్త వెనక భార్య ఎందుకు నడుస్తుందనేదానిపై వివరణ ఇచ్చారు. చాలా మంది మహిళలు భర్త వెనక భార్య నడవడం  సమస్య అనుకుంటారు కానీ అది దేవుడు నిశ్చయించాడని అన్నారు. భర్త  ఏదైనా తప్పు చేసినా.. దారి తప్పినా  సరిదిద్దే అవకాశం భార్యకు ఉంటుందన్నారు. అందుకే భర్త కంటె భార్య రెండు అడుగుల వెనుక నడుస్తుందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై చాలా మంది అప్పట్లో టిక్ టాక్ చేశారు. భర్త వెనక భార్య ఎందుకు నడుస్తుందనే దానికి స్మృతి ఇరానీ వీడియోను లేటెస్ట్ గా ఓ వ్యక్తి  ట్వీట్టర్ లో పోస్ట్ చేయడంతో  వైరల్ అవుతోంది.