స్టూడెంట్స్​కు టాయిలెట్స్​ కట్టరా..?

స్టూడెంట్స్​కు టాయిలెట్స్​ కట్టరా..?

పనికిరాని ప్రాజెక్టులకు కోట్లు తగలేస్తూ స్టూడెంట్స్​కు టాయిలెట్స్​ కట్టరా..?
సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్​కు స్టూడెంట్స్ గోస కనపడట్లేదా..?
వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల ఫైర్​ 

హైదరాబాద్, వెలుగు : ‘రాష్ట్రంలో పనికిరాని ప్రాజెక్టులకు లక్షల కోట్లు తగలేస్తూ.. పేద విద్యార్థులకు బాత్ రూంలు ఎందుకు కట్టడం లేదు. కమీషన్లు రావనేనా..’ అని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. స్టేట్​లో సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ బతికే ఉన్నారా.. ఉంటే స్టూడెంట్స్ గోస వారికి కనపడటం లేదా? అని మండిపడ్డారు. 800 మంది చదువుతున్న కాలేజీలో ఒక్క టాయిలెటే ఉండటం, ఎడ్యుకేషన్ మినిస్టర్ నియోజకవర్గంలోనే టాయిలెట్స్ కోసం స్టూడెంట్స్ రోడ్డెక్కడంపై మంగళవారం ఆమె ట్విట్టర్​లో ఫైర్ అయ్యారు.  

సీఎం, మంత్రి ఉంటే ఎంత.. ఊడితే ఎంత..

“ పిల్లలకు కనీసం బాత్ రూంలు కట్టని సీఎం, విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత.. ఊడితే ఎంత.. బాత్ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అంటున్న బాలికల మాటలు వినడానికే భయానకం. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే ఏ సమాజంలో ఉన్నాం మనం. మీది దరిద్రపు పాలన అని చెప్పడానికి ఇదొక్కటి చాలు.” అని ఆమె ట్వీట్ చేశారు. గడీలు, ఫామ్ హౌస్​బాత్ రూంలకు బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొనే మీకు.. పేద విద్యార్థినుల ఆత్మగౌరవం పట్టదా అని షర్మిల ప్రశ్నించారు. సర్కార్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని గప్పాలు కొడుతూ.. ఇదేనా మీరిచ్చే ప్రాధాన్యత అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.