రెమిడిసివిర్ దొరకట్లే.. బీజేపీ నేతలు స్పందించరా?

రెమిడిసివిర్ దొరకట్లే.. బీజేపీ నేతలు స్పందించరా?

గాంధీ భవన్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోమారు విరుచుకుపడటం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సునామీ తీరులో అటాక్ కావడంతో చాలా మంది చనిపోతున్నారు బాధను వ్యక్తం చేశారు. కరోనా పెద్ద వాళ్లనే కాక యువతను కూడా ముప్పుతిప్పలు పెడుతోందని తెలిపారు. 

'కరోనా సెకండ్ వేవ్విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకపోవడం దారుణం. పేద ప్రజలకు కరోనా సోకితే చికిత్స చేయించుకోలేక చనిపోతున్నారు. రెమిడిసివిర్ ఇంజక్షన్ దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా దీని మీద బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు? బండి సంజయ్ తోపాటు కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? అన్ని మందుల షాపుల్లో రెమిడిసివిర్ ఇంజక్షన్ దొరికేలా చూడాలి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలి. బ్లాక్ ఫంగస్ పై సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టాలి. ఏపీ ప్రజలు హైదరాబాద్ వస్తుంటే చెక్ పోస్ట్ ల వద్ద ఆపడం దారుణం. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని వివిధ హాస్పిటల్స్ కు వచ్చే కరోనా పేషంట్లపై వివక్ష వద్దు. మానవతా దృక్పధంతో వారిని కూడా ఆదుకోవాలి. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజక వర్గంలో కరోనా రోగులకు 70 నుంచి 80 సిలిండర్లు అందజేశాం. నా సొంత ఖర్చులతో గాంధీ భవన్ లో రెండు అంబులెన్సు లను ఏర్పాటు చేశా. స్కామ్ లు తర్వాత.. ముందు ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేద్దాం. లాక్ డౌన్ మంచి నిర్ణయమే.. దీన్ని మరో పది రోజులు పెంచాలి' అని జగ్గారెడ్డి కోరారు.