టీఎస్ఎల్పీఆర్బీకి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: గతంలో ఇచ్చినట్లుగా.. ప్రస్తుత పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో మెరిట్ లిస్టును ఎందుకు పబ్లిష్ చేయలేదో చెప్పాలని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులను హైకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 18 ఎఫ్ నిబంధన ప్రకారం మెరిట్ లిస్ట్‌ను ప్రకటించకుండానే రిజల్ట్స్ ప్రకటించటం చెల్లదంటూ సంతోషి మరో పది మంది వేసిన రిట్‌ను ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావ్ విచారించారు.
మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే ఎంపికైన క్యాండిడేట్ల జాబితా ప్రకటించడం చెల్లదని పిటిషనర్ల వాదన. ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు విచారణను ఈ నెల15 కి వాయిదా వేసింది.

