కేసీఆర్ కు మినహాయింపు ఎందుకు?: ఆది శ్రీనివాస్

కేసీఆర్ కు మినహాయింపు ఎందుకు?: ఆది శ్రీనివాస్

ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, ఆయన పార్టీ లబ్ధిదారు అని, సిట్  విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని విప్  ఆది శ్రీనివాస్  గురువారం ఒక ప్రకటనలో అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్  చేసినట్లు హరీశ్ రావు అనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మ గౌరవం ఎందుకు దెబ్బతింటుందో హరీశ్  చెప్పాలని డిమాండ్  చేశారు. 

తెలంగాణ ఆత్మగౌరవం అమరుల త్యాగాల్లో ఉందన్నారు. గతంలో అనేక మంది మాజీ సీఎంలు విచారణను ఎదుర్కొన్నారని, వారికి లేని మినహాయింపు కేసీఆర్ కు ఎందుకని  ప్రశ్నించారు. చట్టం ముందు కేసీఆర్ అయినా.. ఇంకెవరైనా ఒక్కటే అనే విషయానన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలని, అనవసరమైన రాద్ధాంతాన్ని మానుకోవాలని సూచించారు.