కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోక్యమెందుకు?..    మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోక్యమెందుకు?..    మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతో తనకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని, తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు చెందినవాడిగా ఉంటూనే కాంగ్రెస్ మున్సిపల్ టికెట్లలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 

తమ పార్టీలో కలహాలు సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. జగిత్యాల, రాయికల్ పట్టణాల ఓటర్లు నిజమైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేయని వ్యక్తులకు కాంగ్రెస్ టికెట్లు రావడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్​ నాయకులు ఎద్దండి భూమారెడ్డి, గోపి రాజరెడ్డి, బాపురం నర్సయ్య, ఎద్దండి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.