V6 News

కరీంనగర్- జగిత్యాల హైవే పనులు స్పీడప్ చేయండి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

 కరీంనగర్- జగిత్యాల హైవే పనులు స్పీడప్ చేయండి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందని, పనుల్లో వేగం పెంచాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నన్ను ఆయన మర్యా దపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. కేంద్ర మంత్రితో మాట్లాడుతూ.

ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే ఈ కీలక మైన జాతీయ రహదారి పూర్తయితే కరీంన గర్, జగిత్యాల ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరు గుపడుతుందన్నారు. సానుకూలంగా స్పం దించిన బండి సంజయ్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి నట్లు ఎమ్మెల్యే తెలిపారు.