
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం, ఇన్‌ఫ్లేషన్ ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిలదీశారు. తాను అడిగే అన్ని ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని.. ఆయన ట్విట్టర్ వేదికగా శుక్రవారం డిమాండ్ చేశారు.
"ఇన్‌ఫ్లేషన్ 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది.? నిరుద్యోగం 45ఏండ్ల గరిష్టానికి ఎందుకు వెళ్లింది.? పరోటాలపై 18% జీఎస్‌టీ ఎందుకు విధించారు.? రైతులు ఉపయోగించే ట్రాక్టర్లపై 12% జీఎస్‌టీ ఎందుకు వేశారు.? భారత్ జోడో యాత్ర భవిష్యత్తులోనూ మరిన్ని సమస్యలపై ప్రశ్నిస్తుంది. అన్నింటికి ప్రధాని సమాధానం చెప్పాలి" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.