రెడ్ రిబ్బన్కు ఎయిడ్స్ డేకు ఉన్న సంబంధం ఏమిటి..?

రెడ్ రిబ్బన్కు ఎయిడ్స్ డేకు ఉన్న సంబంధం ఏమిటి..?

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక HIV కి వ్యతిరేకంగా పోరాడడం కోసం వరల్డ్ ఎయిడ్స్ డేను జరుపుతారు. ఎయిడ్స్ డే రోజున ప్రతీ ఒక్కరు ఎర్ర రిబ్బన్ ధరిస్తారు. ఇది ఎయిడ్స్ డేకు చిహ్నంగా భావిస్తారు. మరి ఎయిడ్స్ దినోత్సవం రోజు రెడ్ రిబ్బన్ ధరించడానికి ఉన్న కారణాలేంటి.. దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం..

ఆసక్తికర కారణాలు..

ఎయిడ్స్‌ ప్రాణాంతకమైన వ్యాధి. మందులేని ఈ మాయరోగం ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అవగాహన లోపం.. నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిడ్స్ వ్యాధి కారణంగా మరణించిన వారి జ్ఞాపకార్థం ప్రజలు ఏడాది పొడవునా ఎరుపు రిబ్బన్ ను ధరిస్తారు. ఎందుకంటే రెడ్ రిబ్బన్ ను ఎయిడ్స్ పై అవగాహనకు చిహ్నంగా భావిస్తారు.  అయితే ఎయిడ్స్ పట్ల అవగాహన కోసం  ఎరుపు రిబ్బన్‌ను ఎందుకు ఎంచుకోవడానికి  ఆసక్తికరమైన కారణాలున్నాయి.  HIV -పాజిటివ్ కలిగిన బాధితుల పట్ల సంఘీభావం, ప్రేమను ప్రదర్శించేందుకు రెడ్ రిబ్బన్ ఉపయోగపడుతుందని కొందరు నమ్ముతారు. అంతేకాదు.. బాధలో ఉన్న బాధితుల నిస్సహాయతను రెడ్  ప్రతిభింబిస్తుందని ఇంకొందరు విశ్వసిస్తారు. ఎయిడ్స్ వ్యాధి ప్రధానంగా రక్తం ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి..వ్యాధిపై అవగాహన కోసం రెడ్ రిబ్బన్ చిహ్నం సరిగా సరిపోతుందని భావిస్తారు. 

చరిత్ర ఏమిటి..?

ఎయిడ్స్ చిహ్నానికి  1988లో బీజం పడింది. ఎయిడ్స్ పై  ప్రపంచానికిఅవగహన కల్పించే  ఉద్దేశంతో కళకారులు, కళా సంస్థలు, కళా ప్రేక్షకులు , కళా నిపుణులు ఒక వీడియోను రూపొందించారు. ఈ కళాకారుల్లో కొందరు మూడేళ్ల తర్వాత అంటే 1991లో HIVతో జీవిస్తున్న వ్యక్తులు, బాధితులను సంరక్షిస్తున్న వారికి సంఘీభావంగా ఓ వీడియో చిహ్నాన్ని రూపొందించారు. ఆ తర్వాత వీడియో చిహ్నం రెడ్ రిబ్బన్ గా రూపాంతరం చెందింది. అంతకుముందు ఏడాది  గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ సైనికులు పసుపు రిబ్బన్‌ను ధరించారు. ఈ రిబ్బన్ నుంచి ప్రేరణ పొందిన కళాకారులు.. HIVతో నివసించే వారికి మద్దతు, సంఘీభావాన్ని సూచించడానికి..అలాగే ఎయిడ్స్ తో మరణించిన వారిని గుర్తుంచుకోవడానికి ఎరుపు రిబ్బన్‌ను చిహ్నంగా ఉపయోగించాలని  నిర్ణయించారు.

 

స్విస్ వెబ్ సైట్ ప్రకారం..

ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రభుత్వేతర సంస్థ అయిన UNAIDS వెబ్‌సైట్ ప్రకారం..   మనుషులకు రక్తంతో అనుబంధం,  - కోపం నిదర్శనంతో పాటు... ప్రేమకు ప్రతిరూపంగా ఎరుపు రంగును ఎంచుకున్నట్లు ఈ రెడ్  రిబ్బన్  ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు చెప్పారు.  రెడ్ రిబ్బన్ ప్రాజెక్టులోభాగంగా ప్రపంచానికి ఈ ఎయిడ్స్  డే సింబల్ ను దగ్గర చేసేందుకు రెడ్ రిబ్బన్ ప్రాజెక్ట్ వాలంటీర్లు USAలోని  టోనీ అవార్డ్‌లకు హాజరైన ప్రతి ఒక్కరికి లేఖలతో పాటు.. ఎరుపు రిబ్బన్‌లను పంపించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో  నటుడు జెరెమీ ఐరన్స్  రెడ్ రిబ్బన్ ధరించి మరింత మందికి స్పూర్తినిచ్చాడు. ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని 70  దేశాల్లో   బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు చూశారు.  అప్పట్లో  చాలా మంది ప్రముఖులు ఎరుపు రంగు రిబ్బన్‌లను ధరించారు, దీనికి తోడు యువరాణి డయానా కూడా ఎరుపు రిబ్బన్ను ధరించారు. 

ఒకే రోజు లక్షకంటే ఎక్కువ మందికి పంపిణీ

1992లో ఈస్టర్ సోమవారం రోజు లండన్లోని వెంబ్లీ స్టేడియంలో ఫ్రెడ్డీ మెర్క్యురీ ఎయిడ్స్ అవేర్‌నెస్ ట్రిబ్యూట్ కాన్సర్ట్ సందర్భంగా ఒకే రోజు లక్ష కంటే ఎక్కువ మందికి రెడ్ రిబ్బన్‌లు పంపిణీ చేయబడ్డాయి. ఇది ఐరోపాకు ఎయిడ్స్ చిహ్నాన్ని పరిచయం చేయడానికి ఎంతో ఉపయోగపడింది.   ఎరుపు రిబ్బన్‌ను ధరించడం అనేది ఎయిడ్స్‌తో సంబంధం ఉన్న వారు...వారి పట్ల వివక్షను  ఎదుర్కోవడానికి శక్తివంతమైన మార్గం. అందువల్ల  రెడ్ రిబ్బన్ HIV-పాజిటివ్ వ్యక్తులకు సంఘీభావం, మద్దతుకు  చిహ్నంగా ఉపగిస్తున్నారు.