రమ్ ప్రియులకైనా తెలుసా... బకార్డీ బాటిల్‌పై గబ్బిలం చిత్రం ఎందుకుందో..

రమ్ ప్రియులకైనా తెలుసా... బకార్డీ బాటిల్‌పై గబ్బిలం చిత్రం ఎందుకుందో..

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ దీన్ని సేవించడానికి చాలా మంది ఇష్టపడతారు. సంతోషం, దుఃఖం.. ఇలా ఏ ఎమోషన్ అయినా ఆల్కహాల్ తోనే  షేర్ చేసుకుంటూ ఉంటారు. తాగేవారికి సాకులు గానీ.. తాగడం మాత్రం గ్యారెంటీ అనే స్లోగన్ ను ఫాల్ అయ్యే వాళ్లూ చాలా మంది ఉంటారు . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆల్కహాల్ గురించి కాదు.. రమ్‌కు ప్రసిద్ధి చెందిన బకార్డి బాటిల్ గురించి..

మీరు ఆల్కహాల్ రమ్ ప్రియులైతే బకార్డీ బాటిల్‌ని చూసే ఉంటారు. దాని పైన గబ్బిలం చిత్రం ఉంటుంది. అయితే ఈ పిక్చర్ ను మాత్రమే ఎందుకు ఉపయోగించారని ఎప్పుడైనా ఆలోచించారా..? మద్యపానం చేసేవారికి బకార్డి చాలా పరిచయమే అయినప్పటికీ, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటన్నది మాత్రం అందరికీ తెలిసి ఉండదు. ఈ బాటిల్ పై ఉన్న లోగోలో బ్యాట్(గబ్బిలం) ఉంటుంది. దాన్నే ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ట్విట్టర్‌లో ప్రశ్నల వరద

సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. కానీ చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.  వాస్తవానికి ఏదైనా కంపెనీ లోగో దాని గుర్తింపును తెలియజేస్తుంది. దానికి కొంత అర్థం ఉండేలా తీర్చిదిద్దుతారు కూడా. దీనికి అసలు కారణం ఏమిటంటే.. ఇది క్యూబాలో తయారైన పానీయం అని చరిత్ర చెబుతోంది. బకార్డి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ రమ్ ఫిబ్రవరి 4, 1862న తయారు చేయబడింది. డాన్ ఫకుండో బకార్డి మాస్సో రమ్ తయారు చేసే ప్రదేశంలో చాలా గబ్బిలాలు ఉంటాయి. ఈ గబ్బిలాలు కుటుంబంలోని ఐక్యతను, ఆరోగ్యాన్ని  కలగజేస్తాయని అక్కడి వారు చెప్తుండే వారు. అలా ఆ భార్యాభర్తలు కలిసి  బకార్డీ బాటిల్‌పై బ్యాట్ గబ్బిలం చిత్రాన్ని ఉంచారు. నాటి నుంచి నేటి వరకు ఈ లోగోను అలాగే అనుసరిస్తున్నారు.