టీవీలకు అతుక్కుపోయే నెల వచ్చేసింది.. ఒకవైపు FIFA వరల్డ్ కప్, మరోవైపు T20 ప్రపంచకప్!

టీవీలకు అతుక్కుపోయే నెల వచ్చేసింది.. ఒకవైపు FIFA వరల్డ్ కప్, మరోవైపు T20 ప్రపంచకప్!

FIFA World Cup 2026: ఈ జూన్, జులై నెలల్లో అసలు నిద్ర కూడా సరిపోయేలా లేవు.. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పిచ్చెక్కిపోయే ఫిఫా ఫుట్‌బాల్ మెగా సంగ్రామం అర్ధరాత్రి, తెల్లవారుజామున మనల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేయడానికి రెడీగా ఉంటే.. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ ఆడేందుకు టీమిండియా మహిళలు కత్తులు నూరుతున్నారు. ఇవి చాలదన్నట్టు భారత మెన్స్ క్రికెట్ టీమ్ కూడా ఆఫ్ఘన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు ఆడుతూ ఊపిరి సలపనివ్వకుండా చేయడానికి షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే రెండు నెలలు స్పోర్ట్స్ లవర్స్‌కు పూనకాలు తెచ్చేలా కనిపిస్తుంది. 

ఫుట్‌బాల్ వరల్డ్ కప్: 
రేపటి (జూన్ 11) నుంచి అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఫిఫా వరల్డ్ కప్ షురూ అవుతుంది. రొనాల్డో, మెస్సీ, ఎంబాపె లాంటి తోపు ప్లేయర్లను చూడటానికి ప్రపంచమే వెయిట్ చేస్తుంది. అయితే, మ్యాచ్‌లు అన్నీ మనకు అర్ధరాత్రి, తెల్లవారుజామున వస్తాయి కాబట్టి నిద్రలు బంద్ చేసుకోవాల్సిందే. కానీ ఈసారి ప్రైజ్ మనీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. టోటల్ ప్రైజ్ మనీ ఏకంగా 871 మిలియన్ డాలర్లు ఉంది. ఇక ఆఖరి ప్లేస్‌లో నిలిచే టీమ్‌కు కూడా కనీసం 12 మిలియన్ డాలర్లు ఇస్తారు.  

ఇంగ్లాండ్ గడ్డపై ఉమెన్సీ టీ20 ప్రపంచకప్:  
మొన్ననే భారత జట్టు వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌లు కొట్టి రచ్చ లేపితే, ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీమ్ హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఫుల్ జోష్‌లో ఉన్న మన అమ్మాయిలు.. జూన్ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లాండ్ గడ్డపై జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో దంచికొట్టడానికి బరిలోకి దిగుతున్నారు. ఒకవేళ ఈ కప్పు కూడా మనోళ్లే కొడితే.. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు రెండూ బ్యాక్ టు బ్యాక్ గెలిచిన ప్రపంచంలోనే రెండో టీమ్‌గా భారత్ రికార్డు సృష్టిస్తుంది. 

►ALSO READ | 48 జట్లు, 104 మ్యాచ్‌లు.. భారత్‌లో మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

అసలైన సినిమా మున్ముందుంది: 
* క్రికెట్ ఫ్యాన్స్ కి బోర్ కొట్టకుండా ఈ రెండు నెలల షెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేశారు. ఈ నెలలోనే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగినా అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా మున్ముందుంది. 
* ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ వన్డేలు: జూన్ 13 నుంచి మూడు వన్డేల సిరీస్ షురూ
* ఐర్లాండ్ టూర్: అది అవ్వగానే జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల ఫైట్
* ఇంగ్లాండ్ సిరీస్: జులై 1వ తేదీ ఫస్ట్ డే నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల భారీ టీ20 సిరీస్ స్టార్ట్ 

వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ: 
ఈ సిరీస్‌లన్నింటిలో అందరి కళ్ళు ఒకే ఒక్కడిపై ఉన్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి సిక్సర్లతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాడు. జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగే ఫస్ట్ టీ20లోనే ఇతడు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అదే కనుక జరిగితే.. 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, ఇండియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డెబ్యూ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు.