ఆక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు

ఆక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
  • లోకాయుక్తను కోరిన దేవాదాయ శాఖ
  • నోటీసులు ఇవ్వకపోవడంపై ప్రశ్నించిన కోర్టు 

వరంగల్‍, వెలుగు: వరంగల్​లోని పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ, రంగనాయకస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల భూముల ఆక్రమణదారులపై చర్యలకు మరింత టైం కావాలని దేవాదాయశాఖ అధికారులు లోకాయుక్తను కోరారు. ఆలయ భూముల కబ్జాలపై గతంలోనే వినియోగదారుల మండలి, కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు డిజిటల్‍ సర్వేకు ఆదేశించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జిల్లా అధికారులు సర్వే పూర్తి చేసి 20.39 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు జనవరి 5న నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి కబ్జాదారులపై చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన వివరాలతో ఆగస్టు 3న రావాలని లోకాయుక్త సూచించింది. బుధవారం అధికారులతో పాటు వినియోగదారుల మండలిసభ్యులు కోర్టుకు హాజరయ్యారు. వెలుగు దినపత్రికలో బుధవారం పబ్లిష్​ అయిన ‘కోర్టు చెప్పినా డోంట్‍కేర్‍.. కబ్జాదారులనే కాపాడుతున్నరు’ వార్తను న్యాయమూర్తికి చూపించారు. ఆక్రమిత భూముల చుట్టూ ఫెన్సింగ్‍ ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, ఆక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు అధికారులను ప్రశ్నించింది. అక్టోబర్​26న మళ్లీ రావాలని ఆదేశించగా, ఆ లోపు ఆక్రమణదారులకు నోటీసులిస్తామని సమాధానమిచ్చారు.