నాటు నాటు ఉక్రెయిన్లో ఎందుకు షూట్ చేశారు?

నాటు నాటు ఉక్రెయిన్లో ఎందుకు షూట్ చేశారు?

భారతీయ చిత్ర పరిశ్రమను ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాలోని నాటు నాటు పాట అందరితో నాటు స్టెప్పులేయించింది. అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. అయితే, ఈ పాటను చిత్రీకరించడానికి బ్రిటిష్ ఎంపైర్ బిల్డింగ్ సెట్ కోసం ట్రిబుల్ ఆర్ టీం ఉక్రెయిన్ లోని కీవ్ వెళ్లింది. అక్కడి ప్రెసిడెంట్ ప్యాలెస్ లో షూటింగ్ జరిపింది. అయితే ‘ఇంత టెక్నాలజీ, ఆర్ట్ వర్క్ టెక్నిషియన్స్ ఉన్నా.. వాళ్లను కాదని బిల్డింగ్ సెట్ కోసం ఉక్రెయిన్ వెళ్లడం ఏంట’ని చాలామంది డైరెక్టర్ రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన జక్కన్న..

‘నాటు నాటు షూటింగ్ టైంలో మన దగ్గర వర్షాకాలం. ఇక్కటి పరిస్థితులతో సెట్ వేస్తే అంతా పాడవుతుంది. ఆ పాటను ఉన్నత స్థాయితో చిత్రీకరించాలనుకున్నాం. మా ఆలోచనలకు తగ్గట్టు ఉన్న బిల్డింగ్ కోసం వెతికాం. ఉక్రెయిన్ లోని ప్రెసిడెంన్షియల్ బిల్డింగ్ సరైంది అనిపించింది. ఈ విషయంలో ఉక్రెయిన్ టీంకు మా ధన్యవాదాలు చెప్పాలి. మాకు కావాల్సినట్టు ప్యాలెస్ రంగులు, కొన్ని రూపురేఖలు మార్చారు’ అని సమాధానమిచ్చాడు.