ఢిల్లీకి మాత్రమే ఎందుకు ప్రత్యేక గైడ్‌లైన్స్‌

ఢిల్లీకి మాత్రమే ఎందుకు ప్రత్యేక గైడ్‌లైన్స్‌
  • ప్రశ్నించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశమొత్తం ఒక రూల్‌ ఉంటే ఢిల్లీకి మాత్రమే ఎందుకు ప్రత్యేక రూల్స్‌పెడుతున్నారు అని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. లక్షణాలు లేని పేషంట్లు కచ్చితంగా ఐదు రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉండాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌ చెప్పడంపై కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లోఉండొచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ పర్మిషన్‌ ఇచ్చింది. దేశమంతటా అవే గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. కానీ ఢిల్లీలో మాత్రం ఎందుకు ఇలా? చాలా మందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తోంది. వాళ్లందరికీ ఐసోలేషన్‌ ఫెసిలీటీ ఎలా ఇవ్వగలం?” అని డిజాస్టర్‌‌ అథారిటీ మీటింగ్‌లో కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పటికే మెడికల్‌ స్టాఫ్‌ కొరత ఉందని, ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ అంటే ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లక్షణాలు లేని వారికి ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ లేదని చెప్పుకొచ్చారు. “ ఐసొలేషన్‌ గురించి గవర్నర్‌‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. దీనికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోసారి మీటింగ్‌ నిర్వహించి డిసైడ్‌ అవుతాం” అని మీటింగ్‌లో పాల్గొన్న సిసోడియా ట్వీట్‌ చేశారు.