
రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారినప్పుడు ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సీఎంలు మారినప్పుడల్లా DGPలు మారుతుంటారని, ఎందుకిలా జరగాలని ఆయన అన్నారు. ఢిల్లీలో పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. DGPలకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని ఆయన తెలిపారు. బయట నుంచి ఒత్తిళ్లు లేకుండా పోలీస్ వ్యవస్థను పటిష్టపరచాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నిర్దేశించిందని చెప్పారు వెంకయ్య. పోలీసు వ్యవస్థకు జవాబుదారీతనం, పారదర్శకతలతో కూడిన స్వయంప్రతిపత్తి ఉండాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.