పొల్లాచ్చిలో వైఫ్ అండ్ హస్బెండ్ సాంగ్

పొల్లాచ్చిలో వైఫ్ అండ్ హస్బెండ్ సాంగ్

ఎఫ్‌‌‌‌‌‌2, ఎఫ్‌‌‌‌‌3 లాంటి రెండు హిలేరియస్‌‌‌‌‌‌‌‌‌ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌‎‌‌‌‌లో మరో సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌‌‎‌‌గా ప్రారంభమైంది. ఎక్స్ కాప్‌‌‌, అతని ఎక్స్‌‎లెంట్‌‌‌‌‌‌‎వైఫ్‌‌, ఎక్స్‌‌‌గర్ల్‌‎ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ  ట్రై యాంగిల్‌‌‌ క్రైమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‎లో.. వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫ్‌‎గా ఐశ్వర్య రాజేష్, గర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‎గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు.  ప్రస్తుతం పొల్లాచ్చిలోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌‎లు పోషించిన భార్య, భర్తలపై ఒక అందమైన పాట చిత్రీకరిస్తున్నారు.

 భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటిగా నిలవనుందని మేకర్స్ చెప్పారు.  రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.